హృదయవాసి

ఛాతివద్ద ఎడమవైపున ఉన్న గుండె ఫిజికల్ హార్ట్ (భౌతికమైన గుండె). భగవంతుని స్థానం "స్పిరిచువల్ హార్ట్. దానివే హృదయ మన్నారు. దయ (Compassion) తో కూడినదే హృదయం. కాని, ఈనాడు Compassion పోయి Fashion వచ్చేసింది. (Come-Fashion!) ఛాతి వద్ద ఎడమవైపున ఉన్నది ఫిజికల్ హార్ట్, కుడివైపున ఉన్నది స్పిరిచువల్ హార్ట్ , ఆదే దేవుని మందిరం. "ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి" అన్నాడు కృష్ణుడు. విషయ పరిజ్ఞానము, లౌకిక భౌతిక సాంఘిక రాజకీయ శాస్త్రజ్ఞానములు తలకు సంబంధించినవి: సత్యము, ధర్మము, న్యాయము, త్యాగము, దయ, ప్రేమ ఇవన్నీ హృదయానికి సంబంధించినవి.

(స.సా.జూ.99 పు.192)

ఆధ్యాత్మిక మార్గంలో వేదాంతము మరొకవిధంగా బోధించింది. "నాయనా! నీ హృదయ మనేది సింగిల్ చైర్, ఇది డబుల్ సోఫా కాదు. మ్యూజికల్ చైర్ కాదు. కనుక ఇందులో ఒక్క భగవంతునికి మాత్రమే చోటివ్వు. అయితే తల్లిదండ్రులను ప్రేమించు. వారికి తగిన కృతజ్ఞత నందించు. కాని వారు శాశ్వతం కాదు".

 

మాతా నాస్తి పితా నాస్తి , నాస్తీ బంధు సహోదరః

అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత

 

దేహములన్నీ కదలిపోయే మేఘములవంటివి. నిజమైన మాతృమూర్తి ఒక్కదైవమే. తల్లి గృహవాసి, తండ్రి గృహవాసి, గురువు ఆశ్రమవాసి. దైవ మొక్కడే హృదయవాసి. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈ లోకసంబంధమైన రీతిగా తల్లిని దైవంగా భావించి గౌరవించవచ్చును. కాని, హృదయంలో నిల్చుకోవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే. హృదయంలో ఉండే అర్హత ఒక్క భగవంతునికి మాత్రమే ఉన్నది.

(స.సా.జూ 97. పు. 141,142)

 

నేనెక్కడకైన బయటికి పోవాలనుకుంటే బయట అనే ప్రదేశముంటే కదా! బయట అనేదే లేదు. అందువలనే ఒకానొక సమయములో రాధ చెప్పింది.

 

వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు

రాధ కెందుకో నవ్వు గోలుపు

నాలోన నీలోన నిండెవెలిగే వలపు

మేలుకొంటే లేదు పిలుపు

విశ్వమంతా ప్రాణవిభుని మందిరమయిన

పిలు పేది తలు పేది వీధి వాకిలి యేది

వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి

ఆనందబాష్పములే మీటి ప్రాణతంత్రులు నాటి

ఆనందబాష్పములే ఆత్మార్పణము చేయ

కైలాసమే కానరా వీధి వాకిలి అదియెరా..

 

సందేహము వచ్చినప్పుడు అయ్యో! వేమ ఒంటరిగానే వున్నానే. తలుపు వేద్దామంటే కా న్ష న్స్ తీయమంటూ పిలుపు, వేయి, తీయి అని. ఆనందభాష్పములే వీధి వాకిలి. క న్ను లలో నుండిన వీరు ధారలు కారుతుంది. కైలాసము వైకుంఠము. కుంఠితము కానటువంటిది వైకుంఠము. నిరంతరమూ ఆనందముతో నుండేదే కైలాసము. కైలాసమని వేరే పట్టణములేదు. వైకుంఠమనే వేరే పట్టణము లేదు. నారదుడు భగవంతుడా! నీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడా" అని ప్రశ్నిస్తే మద్భక్త: యత్ర గాయ న్తి తత్ర తిష్టామి నారద!" అన్నారు. ఎక్కడ నా భక్తులు హృదయంలో గానం చేస్తారో అక్కడ నేను ప్రతిష్టఅవుతానన్నాడు భగవంతుడు. కైలాసం వైకుంఠం, స్వర్గం ఇవన్నీ బ్రాంచాఫీసు అడ్రసులు. పర్మనెంటు అడ్రస్ ఒక్కటే. అదియే హృదయస్థానము. భగవంతుడు హృదయములోనే వుంటున్నాడు. హేద్వారక వాసా, హేబృందావన సంచారీ. హే మధురాపుర వాసా." అని అనేకవిధములుగా ప్రార్థించింది. ద్రౌపది. కానీ ఎంత వర్ణించినా ప్రార్థించినా కృష్ణుడు రాలేదు. అలసి పోయింది. స్వరము కూడా పోయింది. "హే హృదయవాసీ అని వ్రాలిపోయింది. వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలమయిన తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు సోదరా! ఆనాడు నాకు పరాభవము జరుగుచున్నప్పుడు ఎన్ని పర్యాయములు పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు? ఔనామ్మ రాలేదు. ఓ! ద్వారకా వాసీ! అని పిలిచావు. నేను నీకు దగ్గరవున్నా నీ మాట విలబెట్టటాన్కి నేను ద్వారకకు పోయిరావాలి. అకాలంలో హెలికాప్టర్లు, యేరో ప్లేన్లు లేవు. బృందావన విహారీ అంటే బృందావనాన్కి పోయిరావాలి. అక్కడకి పోయిరావడంలో అలస్యమయింది. హృదయ వాసి అని పిలిచినప్పుడు నేను తక్షణమే వచ్చాను. భక్తుల మాటను నిలబెట్టుటకై భగవంతుడు అనేక మార్పులు చేయవలసి వస్తుంది. నీవు బృందావన విహారి అని పిలిచినప్పుడు నేను బృందవనాన్కి పోకుంటే నీ మాటకు విలువ ఉండదు.

(స.ది.పు. 28/30)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage