"విష్ణువు చతుర్భుజములలో శంఖు, చక్ర, గదా పద్మములనుధరించయుంటాడు. శంఖము శబ్దమునకు, చక్రము కాలమునకు, గద శక్తి,కి, పద్మము హృదయమునకు చిహ్నములు. శబ్దమునకు కాలమునకు, శక్తికి, జీవరాసులన్నిటి యొక్క హృదయకమలములకు ఆయన అధిపతి. అదే విధముగా, శివుడు ఒక చేతిలో డమరుకము రెండవ చేతిలో త్రిశూలమును ధరించి యుంటాడు. డమరుక నాదమునకు, త్రిశూలము త్రికాలాత్మకమైన కాలమునకు చిహ్నములు, శబ్దమునకు, కాలమునకు ఆయన అధిపతి. ఈ విధముగా శివుడు, విష్ణువు ఇద్దరూ ఒకరే, రూప, నామములు మాత్రమే వేరు. వారిరువురూ ఒకటేనని భావించకపోవడం భక్తుని యొక్క సంకుచితత్త్వమును తెలియజేస్తుంది."
(దై.ది పు.64)