సాయి ఒకటే హాయి! కలియుగంలో, రాక్షసులకు నరసింహ నామం భీతి కలిగిస్తుంది. నామాన్ని నాలుక పైన, మనస్సులోను శాంతితో స్పష్టంగా ప్రకాశించనియండి. ఆ నామమునకు సంబంధించిన రూపాన్ని మీ కనుల యెదుట, మీ మనోనేత్రం యెదుట ఉంచండి. అప్పుడు ఏదీ మీకు అపకారం కలిగించలేదు. పిల్లలకు చిన్నప్పటి నుంచి నామస్మరణ చేయుటం, నామమును నమ్ముకొనటం నేర్పండి. తల్లిపాలతో దానిని పోయండి. మీరు వారి ఎదుట ఆచరిస్తూ, మీరు దాని వల్ల పొందిన శాంతిని ఉదహరిస్తూ వారికి శిక్షణ నివ్వండి. వెనుక అడుగు వేయకండి. ముందుకు సాగండి. సంకోచించకండి, సందేహించకండి. మీరు పొందిన ఆనందాన్ని మీరు పొందిన ధైర్యాన్ని కాదనకండి. మీకు ఇంకా సందేహంగా ఉంటే మీకు కలిగే లాభమే పోతుంది.
(వ.61-62 పు.165)
(చూ॥ నగరసంకీర్తన, విశ్వాసము)