మీరు పుట్టపర్తి వస్తారు. ఇక్కడ స్వామి పోటో ఒకటి కొంటారు. ఇంటికి తీసుకొని వెళ్ళి పూజిస్తారు. రోజు లేకపోతే వారానికొక రోజు ఏ గురువారం నాడో భజన చేస్తారు. మంచిదే. అది సత్కర్మే. కాని అది సరిపో తుందా? సద్గుణం కూడా కావాలి. మంచి అలవాట్లు, మంచిగా ఆలోచించటం, మంచి శీలాన్ని పెంపొందించుకోవటం, మంచి నడవిడి - ఇవన్నీ సద్గుణాలు. ఇంతేకాదు. భారం స్వామి పైవేసి, సేవాభావంతో మెలగండి! లేకపోతే? పుణ్యం, పాపం ఒకదాన్నొకటి రద్దుచేసి కొంటూపోతాయి. సున్నకు సున్నా - హళ్ళికి హళ్ళి,
(శ్రీసా గీపు, 388)