స్వీట్లు వేరుగా నుండినా! అందులోని చక్కెర అంతా ఒక్కటే
వ్యక్తులందరు వేరు వేరుగా నుండినా అందరిలో తత్త్యమంతా ఒక్కటే.
(సా| పు 613)
లక్ష్యము ఒక్కటే. మార్గములు వేరు వేరైనప్పటికి గమ్యం ఒక్కటే. కనుకనే - శృంగారములు వేరు బంగార మొక్కటె
జీవజంతులు వేరు జన్మ మొకటటె
జాతి నీతులు వేరు దైవమ్ము ఒక్కడే
పూలజాతు లు వేరు పూజ లొక
తెలియలేకను మానవుల్ తెలివి తప్పి
బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి
ఈ బ్రతుకు కోసము ఇన్ని మార్గములు పడుతున్నారే కాని నిజముగా యోచిస్తే అన్నీ ఒకటే. ఏ మతాన్ని మనము విమర్శించకూడదు. నా మతము గొప్పది. నీ మతము తక్కువని వాదోపవాదములు చేయటము సంకుచిత బుద్ధులు స్వభావము. అన్ని మతములు ఒక్కటే, అన్ని మతముల బోధలు ఒక్కటే, అన్ని మతములు సత్యము ఒక్కటే, ఈ విధమైన సమత్వాన్ని మనము అనుసరిస్తూ పోతుంటే తప్పక మనలో దివ్యత్వము ఆవిర్భవిస్తుంది.
(బృత్ర.పు. ౧౬౮)
క్రమక్రమేణ గాయత్రీ మంత్రమందు సూర్యుని ప్రధానమైన దేవతగా విశ్వసిస్తూ వచ్చారు. ధియో యోనః ప్రచోదయాత్’. సూర్యుడు ప్రకాశించునట్లుగా మానవుని బుద్ధి అమితంగా ప్రకాశించాలి: సూర్యప్రకాశము బుద్ధిలో ప్రవేశించాలనే ప్రార్థనలు సలుపుతూ వచ్చారు. గాయత్రి మంత్రముచ్చరించుకుంటూ గాయత్రి వేదమాత అని విశ్వసించినారు. గాయత్రి ఒకకాలమునకు ఒక దేశమునకు ఒక పాత్రకు సంబంధించినది కాదనియు, భూర్భువస్సువః మూడులోకములకు మూడు కాలములకు సంబంధించిన దని విశ్వసించారు. "తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియో యోనః ప్రచోదయాత్” చీకటిని రూపు మాపేది వెలుగు. వెలుగు లేకుండా చీకటి దూరముకాదు. చీకటిని రూపుమాపే సూర్యుడు గాయ త్రిరూపములో ప్రధానస్థానమున ఆక్రమించాడు. ఈ విధముగా యేదో ఒక శక్తి వున్నదని, ఈ శక్తియే దైవమని విశ్వసించుకుంటూ వచ్చారు.
క్రమక్రమేణా అంకెలను నేర్చుకోటానికి ప్రయత్నిస్తూ వచ్చారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. ఈ పది అంకెలలోపల ఒకటే ప్రధానముగాని మిగిలినవన్నీ దానికి భిన్న స్వరూపములే. రెండు అనే అంకె రెండు ఒకట్లు చేరడం వల్లనే రెండు అయిపోయింది. తొమ్మిది అనే అంకె తొమ్మిది ఒకట్లు చేరటం వల్లనే సంభవిస్తుంది. మిగిలిన నెంబర్లన్నీ ఒకటికి రూపాంతరములే అనే సత్యాన్ని గుర్తించారు. కనుక ప్రధానముగా ఒక్కటే వున్నది. "ఏకం సత్ విప్రా: బహుధా వదంతి" ఉన్నది ఒక్కటే అయినప్పటికిని వ్యక్తులు అనేకముగా భావిస్తున్నారనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు. దీనినే వేదమునందు "ఏకోహం బహు స్యాo " ఉన్నది ఒక్కటే అనేక లక్షలు మిలియన్లుగా మారిపోతుంటున్నాది. ఒకటి లేక రెండుగాని, పదిగాని, మిలియన్లుగాని కావటానికి వీలుకాదు. ఈ అంకెల ద్వారా దైవము కూడను ఒక్కటే అనే సత్యమును మానవులు గుర్తించినారు. ప్రపంచములో మనకు ఆతీత మైన శక్తి ఒకటి వున్నదనియు ఆ శక్తి ఒకటేగాని రెండు కాదని విశ్వసించినారు. ఆ ఒక్కటే అనేకరూపముల ధరించి అనేక రూపనామములతో జగత్తున వ్యాపించి వుంటున్నది.
మానవుడు గుర్తించవలసినది ఒక్కటే. ఒక్కదానిని గుర్తించుకుంటే అన్ని అందులో లీనమైపోతాయి. ఆ ఒక్కటే ఏమిటి? అదే ఆత్మతత్వము ఈనాడు ఆత్మవిశ్వాసము కోల్పోతున్నాము. ఆత్మగాని అనాత్మ భావములన్నియు తెలుసుకుంటున్నాము. మనము చేయవలసిన సాధనలు ఏమి టిప్పుడు?ధ్యానమా?యోగమా? తపమా? జపమా? యజ్ఞమా? యాగమా? క్రతువులా? ఇవి యేమియు కాదు. ఒక్కటి మాత్రమే మనముగుర్తించాలి.అనాత్మభావమునువదలి పెడితేఆత్మసాక్షాత్కారమవుతుంది. ఏసాధనలు చేయనక్కర లేదు. ఈ సాధనలు కేవలము మనస్సు తృప్తి కోసం చేసేవి. సాధనలన్నీ మనస్సు ద్వారానే చేస్తున్నాము. మనసు ద్వారా చేసే సాధనలు మనస్సు నేవిధంగా అరికట్టగలవు? దొంగను దొంగ పట్టగలడా? తానే దొంగయైనప్పుడు తనను తాను పట్టటానికి యేమాత్రము ప్రయత్నించడు. అదేవిధముగనే మనస్సు మనస్సును పట్టటానికి యేమాత్రము ప్రయత్నించదు. మనసును మనము అమనస్కము చేసుకోవాలి. అమనస్కమనగా ఏమిటి? సంకల్పారహితమే అమనస్కము. సంకల్పములు క్రమక్రమేణా తగ్గించుకుంటే తప్పక మనస్సు యొక్క ప్రభావము తగ్గిపోతుంది.
(ఉ. పు. 35)
ప్రేమ, ప్రేమించువాడు. ప్రేమింపబడువాడు మూడు ఒక్కటే. ప్రేమ లేక ప్రేమించువా డుండడు. ప్రేమ, ప్రేమించువాడు ఉండియూ, ప్రేమింపబడువాడు లేనిది ప్రేమ వినియోగము లేదు. ఈ మూడింటి యందు ప్రేమ ప్రధానవస్తువుగా తేలుచుండును. అట్లు సమానముగా, ప్రధానముగా ఏది అన్నింటియందు ఇమిడియున్నదో అదే పరమాత్ముడు.
( ప్రే. వా పు.44)
"అంకె తరువాత సున్నల కబ్బు విలువ
అటులే ఒక్కడొ దేవుని కనిన పిదప
నీవు లెక్క గొను అనేక జీవగతుల
ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు
సాధుసద్గుణ గణ్యులో సభ్యులార!
(ఆ. పు.273)
“లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్, బ్లిస్ ఈజ్ మై ఫుడ్
మై లైఫ్ ఈజ్ మై మెస్సేజ్, ఎక్స్ పేన్షన్ ఈజ్ మై లైఫ్
నో రీజన్ ఫర్ లవ్, నో సీజన్ ఫర్ లవ్, నో బర్త్, నో డెత్"
(పై ఆంగ్ల గీతాన్ని శ్రీవారు భక్తు లందరిచేత పాడించారు. )
అనంతరం తమ దివ్యోపన్యాసాన్ని కొనసాగిస్తూ)
లవ్ ఈజ్ మై ఫామ్" అనగా, ప్రేమయే నా స్వరూపం అనే మాట కేవలం కేవలం స్వామికి మాత్రమే కాదు, మీ అందరికీ వర్తిస్తుంది. కేవలం భగవంతుడు ప్రేమస్వరూపుడు అని మాత్రమే అనుకుంటే ప్రయోజనం లేదు. మీరందరూ ప్రేమ స్వరూపులే. లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్ (ప్రేమయే స్వరూపం, సత్యమే నా శ్వాస) అని మీకు మీరే అనుకోవాలి. అప్పుడే మీరు స్వామితత్వంతో ఏకత్వాన్ని అనుభవిస్తారు. ఐ అండ్ యు ఆర్ వన్ (నీవు. నేను ఒక్కటే) అనే పరిపూర్ణస్థితికి చేరుకుంటారు. దీనినే వేదాంతము. తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి..." అని చాటింది. బైబిల్, ఖురాన్ మున్నగు పవిత్ర గ్రంథములన్నీ ఈ సత్యాన్నే బోధించాయి. కనుక ఏ మతమునూ అపహాస్యం చేయవద్దు. All are one, be alike to every one. ఆందరు ఒక్కటే అని సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.(స.సా.జ. 97 పు.5)
ఉన్నది ఒక్కటే. ఆ ఏకాత్మా సర్వ భూతాంతరాత్మా." అనేక తత్వంగా మీరు భావిస్తున్నారు. అనేకత్వములోని ఏకత్వమును మనం గుర్తించాలి. దీనికి ఉదాహరణ. ఒకటి ఇక్కడ పెట్టండి; యిక్కడ తొమ్మిది పెట్టండి. ఏ పిల్లవానినైనా1 పెద్దనెంబర్9 పెద్దనెంబరా? అనిఅడగండిఏచిన్నపిల్లవాడైనా 9 పెద్ద నెంబరుఅంటాడు. ఇదికాదు.Mathematicsలో 9 పెద్దదిగాని 1biggest నంబరు.ఈఒకటి లేక తొమ్మిది ఎక్కడునుంచి వచ్చింది. 1+1+1+1+1 = 9. ఒకటి లేక తొమ్మిది లేదు. కాబట్టి ఉన్నది ఒక్కటే. ఒకటి పెట్టి, దాని ప్రక్కన సున్న పెట్టండి; యింకొక సున్న పెట్టండి నూరు. యింకో సున్న పెట్టండి వెయ్యి. యింకో సున్న పెట్టండి పదివేలు. కాని ఒకటి ఉండినంత వరకే సున్నలకు విలువ. ఆ ఒకటి హీరో. ఆతనే God. World is zero. Moon is zero, Earth is Zero, Sun is Zero. అన్ని జీరోలు పెట్టుకున్నపుడు వాటికి విలువ వస్తున్నది. కట్టకడపటికి Life is zero కానీ ఉన్నది ఒక్కటే ఆ ఒక్కదానికి ఏనాడు ముప్పురాదు. “ఏకోహం బహుస్యాం" తానొక్కడే అనేకంగా రూపొంది నాడు. అదియే ఆత్మతత్త్యము.
జగత్తంతా నిండినది ఒక్కటే. ఆ ఒక్కటే అనేక రూపములుగా గోచరిస్తున్నది. కనుక ఆత్మతత్త్యము మనం గుర్తించాలనుకుంటే జీవతత్త్యమును ఏకత్వముగా భావించాలి. మన పిచ్చికోతి వంటి మనస్సును సక్రమమైన మార్గములో నడిపింపచేయాలి. అప్పుడప్పుడు పిల్లలకు చెబుతాను.
Mind is like a mad monkey. Body is like water bubble.
Don t follow the mind, follow the conscience.
అదియే ఆత్మ Conscience ని follow చేస్తూరావాలి దీనినే తెలుగులో ఆత్మసాక్షి"అన్నారు.ఈ ఆత్మసాక్షిగా ఒక పని మనం చేసినామంటే విజయమే సాధిస్తాము. కానీ ఆత్మ సాక్షి మనం ఏనాడూ తీసుకోవటం లేదు. పరుల సాక్షిని మనం తీసుకుంటున్నాము. ఇతను నాకు సాక్షి అని. కాదు కాదు ఆత్మయే సాక్షి. అట్టి self_confidence మనలో రావాలి.
(ద. యు.స. పు. 96/97)
నీవు అజ్ఞానము నుండి లెమ్ము లెమ్ము. ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్యవరాన్ని బోధత. ఈ అజ్ఞానమనే నిద్ర నుంచి నీవు మేలుకో. ఈ ప్రాకృత భావమునుంచి నీవు మేలుకో. లౌకిక జీవితము నుండి నీవు మేలుకో. దివ్యభవ్యమైన ఆత్మతత్త్వములో నీవు మేలుకో. స్వస్వరూప సంధానము. ఇదే ఆత్మ నిష్ఠ, ఆత్మ సందర్శనము. ఇదే self realisation. ఆత్మసాక్షాత్కారము ఇదే. నిన్ను నీవు ఎవరో తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకొనక అన్నింటిని తెలుసుకున్నానంటే అజ్ఞానమే. తనను తాను తెలుసుకొనక అన్నింటిని తెలుసుకున్నానంటే అజ్ఞానమే. తనను తాను తెలుసుకోవటానికి ప్రయత్నించిన వాడే నిజమైన జ్ఞాని. ఇక్కడ రెండు లేవు, తెలుసుకునేవాడు. తెలుసుకోబడేది రెండు లేవు. రెండు ఉంటే ద్వైతమే అవుతుంది. గాని అద్వైతము కాదు. ఒక్కటే ఉండాలి. ఉన్నది ఒక్కటే. నేను రెండుగా లేను. నేను రెండుగా ఎట్లా కనిపిస్తున్నాను? నిలువుటద్దము ముందు ఉండటం చేత రెండుగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం భ్రాంతి కానీ సత్యము కాదు.
నిలువుటద్దములో నీడ చూచుటకు జోడేల?
వియత్పథములో చంద్రుని విలోకించుటకు వెలుగేల?
ఆత్మతత్త్యము తెలుసుకొనుటకు గురువేల? అన్నారు.
నీవు ఎప్పుడు ఒకటి అయిపోతావు? రెండు లేనటువంటి తత్త్వాన్ని మనం పొందాలి. ఎన్ని రూపములైనా ఇది ఒక్కటే. ఎన్ని చలనములు పొందినా ఇది ఒక్కటే..
(ద. య. స. పు.98)
జగత్తునందు రెండులో ఒక్కటి ఉంటున్నది. జడము చైతన్యము, దేహము - దేహి. క్షేత్రము - క్షేత్రజ్ఞుడు. ఇది రెండుగా ఉండినప్పటికీ, రెండూ చేరి ఒక్కటే. మనము ఒక మోసంబీ పండును తీసుకొన్నాము. పైన చేదు చర్మము తీసివేస్తే లోపల స్వీట్ జ్యూస్ మనకు లభ్యమవుతుంది. ఇటువంటిదే క్షేత్ర- క్షేత్రజ్ఞ విభాగయోగము. దేహము - క్షేత్రము. లోపల ఉన్నవాడు. క్షేత్రజ్ఞుడు. ఐతే రెండూ చేరి ఒక్కటే! కానీ, అనుభవించవలసినది. ఒకటి, త్యజింపవలసినది మరొకటి. మోసంబీ పైన చర్మమును పారవేస్తున్నాము. స్వీట్ జ్యూను స్వీకరిస్తున్నాము. కనుక, త్యజించవలసింది ఒకటి. వరించవలసింది. మరొకటి. ఇదే ఈనాడు మనం తెలుసుకోవాలి. జగత్తును త్యజించాలి. పరమాత్ముని ప్రేమించాలి. ఇదే మన జీవిత లక్ష్యము. నిజంగా భగవంతుని ప్రేమను అర్థం చేసుకొంటే, చేతిలో నున్న కర్చీఫ్ ను వదిలినంత సులభంగా జగత్తును త్యజించవచ్చును. కర్చీఫ్ ను చేతిలో పట్టుకోవడం చాలా శ్రమకాని వదలటం చాలా సులభం. అదేవిధంగా ప్రేమను అర్థం చేసుకున్న వారికి జగత్తును త్యజించడం సులభం. అర్థం చేసుకోలేని వారికే ఇది కష్టం.
(శ్రీ భ.ఉ.పు. 163)
(చూ॥ఆధ్యాత్మికము, కర్తృత్వము. క్షేత్రజ్ఞుడు,చైతన్యము,నాప్రక్కన నడచిరా,మనసు, ముక్తి,మూలాధారము, వేరు, స్వాతంత్ర్యము)