శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి
వాజ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి
శ్రీమయి, అష్టఐశ్వర్యమయి, సదాశివమయి
శ్రీ శివశక్తిమయి: సాయిమయి.
(సా.పు 623)
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అరిషడ్వర్గము లనబడును. ఈ యారును మానవునికి శత్రువులు. అవి నిశాచరములయిన - గ్రుడ్లగూబలు, గబ్బిలముల వంటివి. వెలుగును సహింపవు. మానవుని మనసు అజ్ఞానమను చీకటితో నిండి యుండును. కావున నవి యందులో ప్రవేశించి యుండును. చీకటిలో రాళ్ళు రువ్విన పారిపోవు. కత్తితో నరికినను, తుపాకీతో కాల్చినను అంతమొందవు. దీపము వెలిగించినపుడే అవి నశించును. సామాన్యమైన యీ చిన్న సత్యము కూడా శంకరులు బోధించువరకు పలువురికి తెలియలేదు.
(స.వ.పు. 12)