పరమ ప్రేమ తత్వము అయిదవ పురుషార్థము. ఇదే నారదుడు బోధించిన అమృతత్వం. వేద వేదాంగములు శాస్త్రములు నాలుగు పురుషార్థములను మాత్రమే బోధిస్తున్నాయి. కాని, ఉపనిషత్తులు అమృతతత్వాన్ని, జ్ఞానాదేవతు కైవల్యమ్ అనంతమైన అమరత్వమనే జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. జ్ఞానమనగా అద్వైత దర్శనమే. ఇక రెండో పదార్థమే లేదు. ఉన్నది ఒక్కటే. మనకంటికి కన్పించేవన్నీ దాని ఆంగములు. అన్నింటిలోనూ ఉన్నది ఒక్కటే.
(త.శ.మ.పు.48)