కౌసల్య సతి సూక్తి గర్భమౌటను కదా,
రాముడు దేవుడై రమణ గాంచె!
సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా,
కవలు కుశలవులు ఘనులు అగుట!
జిజియా లలామ చెలగి పెంచుట కదా,
పుతలిబాయి రంజిలి పెంచుట కదా,
గాంధి మహాత్ముడై ఘనత తెచ్చె!
ప్రాణికోటికి ఈ విధి పరిమళించె
అహరహంబున బ్రోచెడి అమ్మకంటె
ఆదరంబగు వస్తువు అవని గలదె!
అమ్మ ప్రథమాక్షరంబె ఆద్యక్షరంబు.
(స. సా. జూ. 99పు. 141}
మరియు (స.సా.డి.96 పు.329)
(చూ! నేను)