నిద్ర లేచినదాది నిద్రపోయెడిదాక
ఆస్తికై కుస్తీలు పడతారయా
ధనము కోసం దైవధ్యానాలు బోనాలు
కోటి పన్నాగములు పన్నేరయా
రూపాయి కొరకై లోపాయికారిగా
అడ్డమైన గడ్డి తింటారయా
రంగరంగాయంచు దొంగ మ్రొక్కులు మ్రొక్కి
పంగనామము ప్రజలకు పెడతారయా
ఇతరు లెరుంగకయున్న ఈశ్వరు డెరుంగడా
తగిన ఫలములు అనుభవిస్తారయా.
(స.సా. మా, పు. 164)