"అర్జునా! అక్షరం బ్రహ్మపరం" పరమైన అక్షరమే బ్రహ్మము! అక్షరమంటే నాశనము కానటువంటిది. బ్రహ్మమనగా పెద్దది అని కూడా అర్థము. అనగా. యెంత పె ద్ద ద ని ప్రశ్న ఫు ట్టు నే మో; ఎంత పెద్ద ద ను కొ న్నదా ని కం టె పెద్దది ! అక్షరమంటే మరొక అర్థము కూడా కలదు. దానిని సర్వవ్యాపకమనికూడా అందురు. బ్రహ్మమనగా కేవలము అక్షరమే కాదు. పరమైన అక్షరం దేశకాల జ్ఞానములతోనూ, మరే విధమైన సాధనలతోనూ తెలియని, యేమి చేసిననూ నశిOచిక, కృశించక వుండి నాశనము కానిదే అక్షరం.
అట్టిస్థిరమైనబ్రహ్మమును పొందుటే మానవజాతికిలక్ష్యం,అక్షరమనియు,బ్రహ్మమనియు,రెండుపదములుగశబ్దములుగ గోచరించిననూ అవిరెండూ ఒకటే. అవిబ్రహ్మముయొక్క సగుణ నిర్గుణములను సూచించును. అక్షర శబ్దముబ్రహ్మవాచకమగు‘ఓంకారము ను తెలుపును.. ఆందువలననే దీనిని “అక్షర పరబ్రహ్మయోగ" మనిపిలుతురు.బ్రహ్మమునకు పరమము, అక్షరము అని రెండు విశేషణములు కలవు. అక్షరమను మాటకుప్రణవము అనీయూ, మాయ అనియు, అర్థమువచ్చును,అక్షరమని చెప్పబడేమాయ కూడ ప్రణవానికి శ్రేష్టమయిన వస్తువే. ఇవి సవిశేషము. ఇట్టి బ్రహ్మమును తెలుసుకొన్నవాడే నన్ను పొందును.
(గీ.పు. 125/126)
కాగితంబు మీద కలిగిన అక్షరాల్
చదివినంతనే ధరణి చతురు డగునె?
అక్షరముల యందు అర్థంబు నెరుగుచు
చదువునట్టి వాడె శ్రేష్టు డగును |
(సా. పు. 326)