ఆనాటి విద్యార్థులు ఆ శిక్షణకు కట్టుబడి తూ.చ. తప్పక నియమములను పాటించేవారు. ఆజ్ఞను ఉల్లంఘించే విద్యార్థిని ఆ పరిసర ప్రాంతమునకు రానిచ్చేవారు కాదు. అకార పంచక అరిష్టములు కలిగిన వ్యక్తిని గురువులు సహించేవారు కారు. అకారముతో ప్రారంభమయ్యే అరిష్ట పంచకంలో మొదటిది అలక్ష్యము, రెండవది అవినయము, మూడవది అహంకారము, వాలుగవది అసూయ, ఐదవది అసభ్యత -ఈ ఐదింటిని కూడినవాడు విద్యార్థిగా తగిన వాడు కాడు అలక్ష్యము చేయూడదు. అవినయము ప్రకటించ కూడదు, అహంకారం అంతకంటే ప్రమాదమైనది, అసూయ మహాపాపస్వరూపమైనదీ, ఇంక అసభ్యత - మానవుడుగా ఉండికూడా సమాజమునందు ఏ విశిష్ట భావముతో జీవించాలో, దానికి విరుద్దముగా జీవించుటయే అసభ్యత.
(స.సా.. జూ 91 పు.164)