పూర్వం ఇటలీ దేశంలో అంథోనీ అనే వ్యక్తి వయోలిన్లను తయారు చేసేవాడు. అంథోనీవయోలిన్ చాలా ప్రసిద్ధి గాంచినది. ఒక్కొక్క వయోలినాను తయారు చేయడానికి అతడు priyanka 19 - అందము srinivas ఒక్కొక్క సంవత్సరం తీసుకునే వాడు. ఒకనాడు అతని మిత్రుడు వచ్చి, “అంథోనీ! ఒక్క వయోలిన్ చేయడానికి ఒక సంవత్సరం తీసుకుంటే దాని పై వచ్చే ఆదాయంతో నీ జీవితం జరగడం కష్టం కదా!" ఆన్నాడు. అప్పుడు “అంథోని, బ్రదర్! భగవంతుడు పూర్ణస్వరూపుడు. అతని హృదయం పరిపూర్ణమైనది. కనుక, అతనిని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలపులు, పలికే పలుకులు, చేసే పనులు ఆన్ని పరిపూర్ణమైనవిగానే ఉండాలి. ఆందుచేత, నేను పరిపూర్ణమైన వయోలిన్ తయారుచేయకపోతే భగవంతునికే ద్రోహం చేసినవాడనౌతాను. దానిని చేయడానికి ఎంత సమయం పట్టినా ఫరవాలేదు" అన్నాడు. ఆ కాలంలో పాశ్చాత్యులు కూడా ఈ విధమైన పవిత్ర భావముతో దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. పరిపూర్ణుడైన భగవంతుని మెప్పించాలంటే అతని పరిపూర్ణతలో పావుభాగమోలేక, ముప్పావు భాగమో పొందితే సరిపోదు. పూర్తిగా పరిపూర్ణుడవు కావాలి. ఎందుకంటే - నీవు అతని అంశమే. సముద్రమునకు, అందులోని నీటిబిందువునకు క్యాన్టిటీ భేదము కాని, క్వాలిటీ ఒక్కటే కదా! కనుక, నీవు భగవంతుని పరిపూర్ణతను పొందాలి. నీ నడత భగవంతుని పరిపూర్ణతను పొందాలి. నీ నడత భగవంతుని పరిపూర్ణతను నిరూపించాలి. నీవు తలచే తలపు, పలికే పలుకుపరిపూర్ణసత్యంగా ఉండాలి.కాని,ఈనాడు కృష్ణార్పణం అంటూ తృష్ణార్పణం గావిస్తున్నావు,చెప్పేదొకటి, చేసే దొకటి! కనుకనే, బాధలను దూరం చేసుకోలేక పోతున్నావు.
(స.సా. సె 95 పు.232/233)
(చూ= పరిపూర్ణ ఆరాధన)