ఈ శ్రవణ, మనన, నిధి, ధ్యానాలు అభివృద్ధి కావాలనుకొంటే నామస్మరణ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ నాలుక ఇచ్చినందుకు దుర్భాషలు మాట్లాడుకుండా, దూషణలు చేయకుండా, పరులను నిందించకుండా -పవిత్రమైన నామాన్ని ఉచ్చరించాలి. ఎవరియందూ మనం - దోషములు వెదకరాదు. అందరియందూ ఉన్న ఆత్మనే మనం దర్శించాలి. ఇతరుల యందు దోషములు వెదికేవారు ఎలాంటివారో తెలుసా? కుక్కలు చెప్పులు వెతుకుతాయి. దుష్టుడు తప్పులు వెతుకుతాడు కనుక - దుష్టుడు కుక్కతో సమానము. మంచిని వెతుకు, నీవు మనిషివి కదా! కుక్కవు కాదు. దోషములు ఉన్నప్పుడు, నీ దృష్టిలో అవి దోషరహితంగా భావించు. ఇలాంటి పవిత్రమైన భావములను మనము ప్రేమతో అభివృద్ధి నిజంగా గావించుకొన్నప్పుడు పరమాత్మ స్వరూపులమౌతాము. ( శ్రీవాణి – పు 7-8 జులై 2022)