మీరీ విషయము జ్ఞప్తి యుంచుకొని, దేవుని జేరుకొనుటకు మీరు పెట్టుకొన్న ప్రయాణమును త్వరగా సాగింపుడు. జాగు చేయకుడు. దూరప్రయాణమును పెట్టుకొన్నప్పుడు, మోటారుకారు టాంకును, పెట్రోలుతో నింపుకొనవలె. లేనిచో ప్రయాణము నిర్విఘ్నముగా జరుగదు. మీ ప్రయాణమునకు దేహము-కారు. దానికి కర్మ - పెట్రోలు, కర్మ యనగా నిష్కామకర్మ. అది, కాయికము, మానసికము, వాచికము-అని మువ్విధము. ఆ మువ్విధముల కర్మయు, కాయమున బంధితుడైయున్న యాత్మకు - బంధవిముక్తి కలిగించును. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 88)