సృష్టి అనగా ఏమిటి? ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే సృష్టి. దీనినే ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతియొక్క దివ్యత్వాన్ని రక్షించే నిమిత్తమై మానవుడు ఉద్భవించాడు. తన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నిటిని ఈ విలువలతో పెంచి, తద్వారా తాను తరించాలని మానవత్వంలో ప్రవేశించాడు. మొట్టమొదట మానవుడు తన విలువలను తాను రక్షించుకోవటానికి ప్రయత్నించాలి. మానవునకు ప్రేమ చాలా ప్రధానమైనది. అందువల్లనే mankind అన్నారు. man కు kindness అనేది చాలా ప్రధానమైనది. కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు, ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు, సత్యము లేకపోతే వీడు మానవుడే కాదు, ధర్మం లేకపోతే వీడి ప్రాణమే లేదు. (అనుగ్రహ భాషణం -ద్వితీయ భాగం-పు157)