ఆ రోజుల్లో పుట్టపర్తిలో విద్యుచ్ఛక్తి ఉండేది కాదు. ఒక దసరాపండుగ సమయంలో డీసిల్ ఆయిల్ లేకపోవడంచేత జనరేటర్ పనిచెయ్యడం ఆగిపోయింది. స్వామితో ఈ సంగతి మనవి చేసినప్పుడు, ఆ జనరేటర్‌ను నిర్వహించే భక్తునితో, ఇంధనపు తొట్టిలో కుండెడు నీళ్ళు పోసి నడిపించుమని చెప్పారు. అతడు స్వామి చెప్పిన ప్రకారంగా చేశాడు. ఆశ్చర్యం చూడండి! జనరేటర్ పనిచేయడం ప్రారంభించింది. భక్తులకు విద్యుద్దీపాల కాంతితో పాటుగా స్వామి చూపిన అద్భుతాన్ని చూసి ఆనందించే భాగ్యం కూడా లభించింది! ((శ్రీ సత్య సాయి ఆనందసాయి పు150)