భక్తులు ఎట్టి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి

ఈనాడు అనేకమంది భక్తులమని చెప్పుకొంటున్నారు; భక్తి అనగా కేవలం పూజలు, భజనలు, సేవలు చేయడం మాత్రమేనని భావిస్తున్నారు. ఇవి భక్తికి కొన్ని అంగములు మాత్రమే. భగవంతుని సందేశాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన ఆ భక్తి – ఎట్టి పరిస్థితియందైనా. దానిని ఉల్లంఘించకూడదు. సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టములు సంభవించినా కృంగక, జంకక సత్యమును అనుసరిస్తూ వచ్చాడు. కానీ ఈ కలిప్రభావంచేత అనేకమంది సుఖములందు మాత్రమే భగవంతుని విశ్వసిస్తున్నారు, పూజిస్తున్నారుగాని అరలు కష్టములు, డిండి నష్టములు సంభవించాయంటే మనస్సును మార్చుకుంటున్నారు.

మీకందరికీ తెలుసు; జీససను సిలువ వేయాలని నిర్ణయించినప్పుడు అతనితో పాటు అతని అనుచరులను కూడా సిలువ వేయాలనుకొన్నారు. అంతవరకు జీసస్కు ఎంతో దగ్గరగా ఉన్న కొందరు ఆ సమయంలో తాము జీసస్ యొక్క అనుచరులం కాదన్నారు. ఇలాంటి వారిని భక్తులని చెప్పవచ్చునా?  భక్తులు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితియందైనా - భగవదాజ్ఞను మీరకూడదు. అదియే నిజమైన భక్తుని దీక్ష. అట్టి దీక్షయందే త్యాగము - ఆవిర్భవిస్తుంది. త్యాగమునందే అమృతత్వం ప్రాప్తిస్తుంది. రాజు ఆ సర్వులకూ ఏ భగవత్సందేశాన్ని ఓ అందించడంలో శరీరాన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇట్టి త్యాగమునకు మానవులు - సిద్ధంగా లేరు.దైవప్రేమకోసం పాటుపడకుండా ధనంకోసం, సుఖం కోసం ప్రాకులాడుతున్నారు. ఏమిటీ ధనము! దైవప్రేమయే నిజమైన ధనము, సత్యమే నిజమైన ధనము. నిజంగా దృఢమైన విశ్వాసంతో, అచంచలమైన ఈ ప్రతిజ్ఞతో సత్యం కోసం పాటుపడితే మీకు ఎట్టి కష్టములూ రావు. కానీ దీనికి మీరు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇంక, భగవంతుడు మిమ్మల్ని ఏరీతిగా రక్షించగలడు? ఏరీతిగా అనుగ్రహించగలడు? భగవదనుగ్రహం పొందాలంటే మీరు త్యాగానికి సర్వవిధముల సంసిద్ధంగా ఉండాలి: తిండికి తయార్, పనికి పరార్”అన్నట్లుగాఉండకూడదు. (స.సా. డి. 2020 పు9)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage