ఎంఏలు, బిఏలు ఏర్పడ జదివియు
పేరుగాంచిన పెద్దవారలైన
సంపదలుండియు సద్దానపరులౌచు
పుడమి కీర్తినిగన్న పుణ్యలైన
ఆయురారోగ్యము లనవరతంబుండి
పరిపూర్ణ బలులగువారలైన
జపములు తపములు సతతంబు చేయుచు
వేదంబులను నేర్పు విఫులైన
సాటిరారు భక్తులకు నేనాటికైన
దైవమునుగొల్వనిదె రాదు దండి శక్తి
ఇంతకన్నను వేరెద్ది యెరుకపరతు
సాధుసద్గుణ గణ్యులో సభ్యులార!
(శ్రీ స.వా.పు.123)