సాయి తత్త్యమేమిటి? S అనగా Service (సేవ) A అనగా Adoration (ఉపాసన). Iఅనగా Ilumination (జ్ఞానము) అనగా, మొట్టమొదట సేవ చేయాలి. ఉపాసన సల్పాలి. తరువాత జ్ఞాన తత్త్యమును పొందాలి. ఈనాడు ఎట్టి పనులు చేయక, తిని కూర్చుని, సుఖాన్ని అనుభవించేవాడు గొప్ప అదృష్టవంతుడని మనం భావిస్తున్నాము. ఇది అదృష్టం కాదు. దురదృష్టం! మనం పనిచేయడానికి తినాలి గాని, తినడానికి పుట్టలేదు. కనుక కర్మాధిపత్యమును వహించాలి. ఇదే మన ప్రాచీన సంస్కృతి భోధించినది. మొట్టమొదట ఎవరి కర్తవ్యమును వారు నిర్వర్తించాలి. కాని, దురదృష్టవశాత్తు, ఈనాడు అది జరగడం లేదు. సుఖంగా భుజించి, ఆనందంగా కాలం గడపాలని భావిస్తున్నారు. నిజంగా ఆనందమంటే, ఏమిటో తెలియని మూర్ఖులే ఇలా భావిస్తారు. ఆనందము కర్మయందే ఉన్నది. కర్మలేక ఆనందము లేదు. కనుక, మొదట సమాజ సేవలో పాల్గొనాలి. ప్రాచీన కాలము నుండి భారతదేశము సమాజానికి ఎంతో విలువ నందిస్తూ వచ్చింది. నీ సర్వశక్తులూ సంఘ సేవకు ధారపోయాలి. కేవలం సంఘం కోసం కాదు. నీ సంతోషం నిమిత్తమై నీవు సంఘసేవలో పాల్గొనాలి. అట్లు కాకుండా నీటిపై తైలపు బొట్టువలె సంఘంలో ఏ మాత్రం సంబంధం లేకుండా జీవించడం మరణంతో సమానం. అట్టి వానిని జీవచ్ఛవమని చెప్పవచ్చు.
(శ్రీభ.ఉ. పు.212/213)
నా తత్త్వం మాత్రం దైవత్వం. సర్వత్రా వ్యాపించిన శక్తి
వయస్సును బట్టి దేహము మారుతుందని భావించకూడదు. ఇప్పుడు ఈ దేహానికి 77 సంవత్సరాలు. కాని, నాకేమాత్రం బలహీనత లేదు. చాలా వేగంగా నడువగలను. నా నడక ఇతరులకు హాస్యంగా కనిపిస్తుందనే ఉద్దేశ్యంతో నేను వేగంగా నడవడం లేదు. చిన్నపిల్లవాడు కట్టి పట్టుకొని నడిస్తే, ముసలివాడు బొమ్మలు పెట్టుకొని ఆడుతుంటే ఏవిధంగా నవ్వుతారో, నేను వేగంగా నడిస్తే, పరుగెత్తితే భక్తులు నవ్వుతారు. అందువలన, శక్తి సామర్థ్యము లున్నప్పటికీ నేను వేగంగా నడవను. కాలానుగుణ్యంగా నేను ప్రవర్తిస్తూ రావాలి. ఏవిధమైన బలహీనతలూ నాకు లేవు, రావు. - ఏ అవతారమునకైనా సరే, వృద్ధాప్య చిహ్నములు ఎక్కడా కనిపించవు. నాకేమైనా ముడతలు పడ్డాయా? కన్నులు చూద్దామా, అంటే బల్బులలాగా వెలుగుతున్నాయి. చెవులు బాగా వినిపిస్తాయి. లౌడ్ స్పీకర్స్ కి మిస్టేక్స్ వస్తాయేమోగాని, నా కంఠమునకు ఏ సమస్యా లేదు. సాధారణంగా ఈ వయస్సు వస్తే క్యాటరాక్టు ఆపరేషన్ కో, దేనికో పోతారు. కాని, నాకు నూత్రం వస్తువు ఎంత దూరంలో ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఆనందంగా సాధించగలననే ధైర్యం నాకున్నది. నా శక్తి ఎంతో ఎవరికీ తెలియదు. కాని, ఎంత శక్తి అవసరమో అంతే ఉపయోగపెడతాను. ఎక్కువ వస్తే అదుపులో పెడతాను. నేను ఏమాత్రం మానవతత్త్వంతో విచారణ చేసేవాడను కాను. దేహం మానవాకారం కాని, నా తత్త్వం మాత్రం దైవత్వం. సర్వత్రా వ్యాపించిన శక్తి.
ప్రేమస్వరూపులారా! మీతోపాటు తింటూ, మీతో పాటు తిరుగుతూ, మీతో ఆటలాడుతూ, మీతో మాటలాడుతూ ఉండడంచేత మీరు దీనిని మానవత్వంగా భావిస్తున్నారు. ఈ విధంగా అవతారతత్త్వమును మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం. నాకు ఎప్పుడూ ఏవిధమైన బలహీనతా లేదు. స్వామి నడక మృదుమధురమైన నడక. రఫ్ గా పోయేది కాదు. అసలు నాకు రఫ్ నెస్ లేనేలేదు. నాదంతా స్వీట్నెస్, సాఫ్ట్ నెస్ . దైవత్వము. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 39-41)
"సాయిరాముడే నీదు ప్రతిపన్న భాగ్యం బు
జీవనాధారంబు జీవితంబు
సాయి నామమే నీదు ప్రాకట దైవంబు
భజియింప సేవింప శ్రీకరంబు
సాయి కృష్ణుడే నీదు రక్షక రాజంబు
సంసార క్షితి నార్ప సత్పథంబు
సాయి శివుడే నీదు సర్వబంధు బలగంబు
సకల భోగఫలంబు సమ్మతంబు
సాయి సేవయే నీకింక కామితంబు
సాయి నామమే నీకింక సుధీమతంబు .
సాయి భజనయే నీకింక సుజనవి భ్రాజితంబు
శ్రీపర్తి సాయీశుడు కాపాడు నిన్నెపుడు
కరుణాకరుడు చేపట్టి పైకిలేపును
ఏపట్లను మరువకుండు ఎరుగుము లక్ష్మీ !
స్వామి (1954) అప్పుడు వ్రాసియిచ్చిన పుస్తకమిప్పుడు కనిపించలేదు కనుక నేను నిత్యము చెప్పుకొను జ్ఞాపకమును బట్టియే పై పద్యమును వ్రాసినాను. ఈ పద్యముద్వారా స్వామి “సాయిబాబా" సమగ్రతత్వాన్ని ప్రబోధించినారని నాకిప్పుడు తోచుచున్నది. సాయియే రాముడు. సాయియే కృష్ణుడు. అంటే చేతనులను భక్తులను ఉద్దరించుటకై యుగయుగములందు సాకారముగా, వచ్చే అవతారము! సాయియే శివుడు. అనగా ఆదిదేవుడు! నిరాకార నిర్గుణ పర బ్రహ్మము! లౌకిక మైన నిధులన్నీ తరిగిపోయేవే. మనవెంట వచ్చేవికావు. సాయియే సర్వులకు తరుగని పెన్నిధి. సాయినామము సాయికంటె భిన్నము కాదు. అట్టి సాయి నామమును స్మరించి భజించుట. వలన సర్వవిధములైన రక్షణ పోషణ లభిస్తుంది. సంసార తాపత్రయాలు నిర్మూలమవుతాయి. సాయియే మనిషికీ సమస్త నిజ బంధువు. ఆత్మ బంధువు ! లౌకిక మైన కోరికలు బంధకారణములు. . కాని సర్వభోగ ఫలప్రదాతయు, కోర దగిని వాడును అయిన సాయిని కోరుట మో క్ష ప్రదము. సాయి స న్మా ర్గ దర్శకుడు ! ఇది సాయి తత్త్వం. (భ క్తో థ్థారక శ్రీ సత్యసాయి పు 97-98 )