నా సంకల్పముతో ఆనందారోగ్యములు ప్రసాదించుట కాని, పదార్థ సృష్టికాని నా ప్రత్యేక లక్షణములు కావు. వాటి వెనుకనున్న ప్రేమయే నా ప్రత్యేక లక్షణము. వేటిని నా లీలలుగా దివ్యలక్షణములుగా పరిగణిస్తారో అవి కేవలము నా సహజ లక్షణములు. మిమ్మల్ని నావద్దకు ఆకర్షించేదీ. సత్యాన్వేషకుల వైపు నన్ను త్రోయునది. తీర్థయాత్రలలో యిబ్బందిపడు వారిని రక్షించ పురిగొల్పునది, నేనే సాయిబాబా యని ప్రకటింప చేసింది నా నిజతత్యమైన ప్రేమయే. ప్రతిచర్యనూప్రేమపూరితము కావించును. మనసావాచా కర్మణా ఎవ్వరికీ బాధ కలిగించవద్దు. మీరందరూ ఒక్కటే. నీవితరులను బాధించితే నిన్ను నువ్వు బాధించుకున్నట్లే నీవు సాయివి. అందరూసాయి స్వరూపులే. నీ శరీరములో ఒక భాగమైన చెయ్యి మరొక భాగమైన కంటిని పెరికివేస్తుందా.ఈ భావనయే సరియైన సాధన. మీ హృదయజ్యోతులను ప్రకాశింపవేయుటకే నేను వచ్చినది. ఆ వెలుగువందు మీరు ప్రతి వారిలోనూ సాయిని చూడగలరు"
(స. శి.సు. తృపు 129/130)
అన్నిటి కంటే ముఖ్యం శాస్త్రాలలో చెప్పిన విధులు పాటిస్తూ మీ జన్మభూమి సంస్కృతిని గౌరవిస్తూ మాతృదేశానికి గౌరవం సమకూర్చాలి. దైవ ప్రీతి పాపభీతిభారతీయులకు సహజ లక్షణాలు. వృద్ధులైన జననీ జనకులను సేవించండి గౌరవించండి.నీ మాతను గౌరవిస్తే విశ్వజనని నిన్సు ఆపదలనుంచి కాపాడుగలదు. నీ తండ్రిని గౌరవిస్తే జగత్పిత నిన్ను రక్షించగలడు. నీ మాతాపితలను నువ్వు గౌరవిస్తే నీ బిడ్డలు నిన్ను ఆదరిస్తారనే మాట.
(వ.1963. పు. 107)