ఏదేశం వారు ఆ దేశంపై అభిమానమును అభివృద్ధి పరచుకోవచ్చును. తప్పులేదు. కాని ఈనాడు కన్న తల్లిని వదిలి పెట్టి సవతి తల్లిని మాత్రం ప్రేమిస్తున్నారు. మనదేశం
యొక్క క్షేమాన్ని విస్మరించి, విదేశీయుల క్షేమాన్ని కోరుతున్నాం. ఇది తప్పు. స్వదేశీ క్షేమాన్ని కోరుతూ, విదేశీ క్షేమాన్ని కూడా అభిలషించండి. "లోకాస్సమస్తా - స్సుఖినోభవంతు" అన్ని దేశములూ సుఖంగా ఉండాలని మన ఆభిలాష, ఇటువంటి విశాలమైన భావాలను మనవిద్యా సంస్థలలో నేర్చుకొని వెళ్ళాలి. ఇదే స్వామి అందించే ప్రధాన మైన ప్రేమ సందేశం.
(శ్రీ -జ.95పు. 10)