"నేను సర్వాంతర్యామిగా అందరిలోనూ వున్నానని, సర్వసాక్షి భూతునిగా అన్నీ గమనించు చున్నాననీ మీ మనస్సులో దృఢముగా విశ్వసించుట ద్వారా మీ సేవా సాధనలోనూ, అధ్యయనములోనూ, ప్రవర్తనలోనూ ఆదర్శప్రాయముగా పురోగమించెదరు. మీరింతవరకూ సాధించిన విజయానందముతో ద్విగుణీకృత నూతనోత్సాహముతో మరింత శ్రద్ధాసక్తులతో ముందుముందు మీ కార్యకలాపములు కొనసాగించువలెనని నా ఆశయము. నా ఆశీర్వాదము. ప్రేమ, గౌరవము, సహనము, పరస్పర సహకారములు ప్రతి హృదయము నుండి ప్రతి హృదయములోనికి ప్రవహించవలెను. మీరందరూ ఒకే ఒక శరీరమందలి - సాయి శరీరమందలి ఆంగములే.
(స.శి.సు., తృపు.133/134)
(చూ॥ మ.నస్సు)