లోకములో అన్ని విధములైన జీవితములను క్షణకాలములో గడచి పోతున్నది. అన్నీ అనిత్యములు, అసత్యములే, మనము పగలు చూచిన దంతయు, రాత్రి స్వప్నములో మనకు అదృశ్యముగా ఉంటుంది. మనము స్వప్నములో చూచిన దృశ్యములన్నియు, జాగ్రత్తలో ఆదృశ్యముగా ఉంటున్నది. ఇది పగటి నిద్ర; ఆది రాత్రి నిద్ర ఇది పగటి కల; ఆది రాత్రికల. ఈ పగటి స్వప్నమునందు రాత్రి స్వప్నము లేదు.రాత్రి స్వప్నమునందు పగటి స్వప్నము లేదు. కానీ, నీవు నైట్ డ్రీమ్ (Night Dream) లోనూ ఉంటున్నావు: డే డ్రీమ్ (Day Dream) లోనూ ఉంటున్నావు; నీవు రెండు డ్రీమ్ (Dream) ల లోనూ ఉంటున్నావు. కనుక నీవు ఆమ్ని ప్రజంట్ (Omnipresent); అనగా సర్వవ్యాపకుడవు. నీవు ఈ సత్యమును గుర్తించుకోటం అత్యవసరం. ఇప్పుడు ఇదొక మాల. ఇది మాల యొక్క కుచ్చు. నేను ఈ మాలను హస్తము పైన వేసుకున్నాను. ఈ మాలలో కుచ్చు ప్యూచర్ (Future) గా ఉంటుంది. మిగతా మాల ప్రజెంట్ (Present) గా ఉంటున్నది. ఇటువైపు పాస్టు (Past) గా ఉంటున్నది. ఈ మాలనుఈ విధంగా త్రిప్పుతూ పోయినా మనుకోండి. తిరుగుతూ, తిరుగుతూ వచ్చేటప్పటికి, యీకుచ్చు ప్రజంట్ (Present) గా వచ్చింది. కాని కొంత తిరిగేటప్పటికి, ఇది ప్రజంట్ (Present) నుంచి పాస్టు (Past) కు వెళ్ళిపోతున్నది. కాని ఈ కుచ్చుకు మాత్రమే ప్రజెంట్ (Present), పాస్టు (past) ఫ్యూచరు (Future) ఈ మూడు కాలములు ఇందులో తిరుగుతూ ఉన్నవికాని, నా హస్తమునకు మాత్రము, ఎప్పుడూ ఒక కాలముగనే ఉంటున్నది. కాబట్టి యీహస్త మనేటువంటిది ఆమ్ని ప్రజెంట్ (Omnipresent). ఇందులో తిరిగేటువంటి కాలమే, ప్యూచరు (Future), ప్రెజెంట్ (Present) పాస్టు (Past). ఈ మూడును, కాలము యొక్క మార్పులే.
ఈ ఫ్యూచరు (Future) ప్రజెంట్ (Present) పాస్టు (Past) లలో కూడను ఒకేకాలమే వుంటున్నది. కాలము ఒక్కటే. Time is one. Time is everything. Don t waste Time. Time wasted is life wasted కనుక, దానిని పురస్కరించు కొనియే "కాలాయనమః, కాలకాలాయనము; కాలాతీతాయనము, కాల స్వరూపాయ నమః, కాలనియమితాయనమః అన్నారు. అన్నింటికిని కాలమే ప్రమాణము. కాలమే ప్రధానము. కాలమార్పు చేతనే మంచి చెడ్డలు కలుగుచున్నవి. కానీ, కాలమే లేకపోతే మంచి చెడ్డలనేటువంటివే మనకు లేవు.
(ఆ.రా. పు. 35/36)