సమ్యక్ దృష్టి యనగా సుదర్శనము అని చెప్పవచ్చును. ఇట్టి సుదర్శనమును కలిగినవాడే దైవాత్మ స్వరూపుడు. మహావిష్ణువు హస్తమునందు సుదర్శనమనే చక్రమున్నదని, దీని కొక కథ. సమ్యక్ దృష్టి కలిగినవాడు భగవంతుని హస్తంలో వుంటుంటాడు అని దీని అంతరార్థము. భగవంతుని స్వాధీనము నందుండుట మాత్రమే కాకుండా భగవంతుడు కూడను కాగలడు. భగవతత్వమును కలిగిన వ్యక్తిత్వమును, భగవత్ స్వరూపాన్ని పొందగలడనే అంతరార్థమును ఆధారము చేసుకొనియే "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి" అన్నారు. "స్థితప్రజ్ఞుడు కాగలిగినవాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి. సుదర్శనమనగా అనేకత్వమునందున్న యేకత్వాన్ని గుర్తించుట, దైవతత్వమనేది ఒక్క ఆత్మతత్వము తప్ప అన్యము కాదు. కనుకనీ దృష్టిని ఆత్మవైపు మరల్చు "మని బోధించాడు కృష్ణుడు.
(శ్రీ గీపు 234)
(చూ త్రివిధ దృష్టులు)