మోక్ష సాధనకు పుపయోగపడే జ్ఞానాన్ని మనిషి ఎలా సంపాదించుకోగలుగుతాడు? ప్రార్థన వల్ల: ప్రేమ వల్ల: దైవానుగ్రహం వల్ల. కేవలం మంచి పనులు చేయటంవల్ల గమ్యాన్ని చేరలేవు. God ను చేరేందుకు కేవలం Good చాలదు. God లోకన్న Good లో ఒక 0 ఎక్కువ వుంది. నీలో కలిగే కోరికయే ఆసున్నా. ఫలాపేక్షయే ఆ సున్నా, కీర్తికాంక్షయే ఆ సున్నా good లోంచి ఆ సున్నా పోతే మిగిలేది god. కోరిక, ఫలాపేక్ష, కీర్తికాంక్ష లేకుండా సేవ చేయాలని, మంచి పనులు చేయాలని తలచే స్వార్థం లేని పరమార్థ తత్వమే ఆ పరమాత్మతత్వం. జావితం+కోరిక = మనిషి; జీవితం- కోరిక= దేవుడు.
(శ్రీసా.గీ.పు.120)