"ఈనాడు ఆకార మానవుడు కనిపిస్తున్నాడే కాని, ఆచార మానవుడు కనిపించుటంలేదు. ఆచార మానవులుగా తయారై సుప్రీం స్టేజికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈనాడు "ను ప్రేంస్టేజి కి వెళ్ళడానికి ప్రయత్నం చేయటం లేదుకాని, సుప్రీంకోర్టుకు మాత్రం పోతున్నారు. కనుక మనం Supreme Court కు కాదు. Supreme Stageకు వెళ్ళాలి. ఆదియే Supreme Divine Self. అట్టి పవిత్రమైన దివ్యజీవితాన్ని మనం అనుభవించాలి."
(శ్రీవ.2000పు.28)