వృత్తులను నిగ్రహించి మనస్సును పరమాత్మయందు లెస్సగా యుంచుట అని అర్థము.స్వస్వరూపస్థితినే సమాధి అందురు. ద్వైతరహితమై యుండునదె సమాధి. గాలిలేనిచోట దీపమెట్లు నిశ్చలంగా వుండునో ఆ విధముగా చిత్తము నిశ్చలముగా నుండువది సమాధి అందురు.
(ప్రశ్నవా.పు.64)
వేదశాస్త్రంబులు వివరించి బుధులచే
చదివించ వచ్చు తా చదువ వచ్చు
యజ్ఞ యాగ తపంబు లధికార జనులచే
చేయించ వచ్చు తా చేయ వచ్చు.
ఇలలోన గల తీర్థముల కేగ అన్యులకు
బోధించవచ్చు తా పోవ వచ్చు.
అష్టాంగ సిద్ధులను ఆర్యుల
- కుపదేశింప వచ్చు సాధించ వచ్చు.
కాని దేహేంద్రియము లరి కట్టి
మనసు నిల్పి యంతర్ముఖము చేసి
అనవరతము సమాధి
చిత్తులై నిలువలేరు.-
(సత్యసారం--పద్య రూపం పు47)