ఈనాడు నిజమైన సమాజ సేవ (Social Service) మచ్చుకైనా కనిపించడం లేదు. అంతా Show Service గాను, Slow Service గాను ఉంటున్నది. సేవ వేరెవరికో చేస్తున్నామనే భావాన్ని విడనాడండి. మీ తృప్తికి మీ ఆనందానికి, మీరు తరించడానికి చేస్తున్నా మని
భావించండి. మీరు ఏ పని చేసినా అంతరాత్మ తృప్తి పడాలి. ఇతరుల మెప్పుకోసం సేవ చేయకూడదు. మీ అంతరాత్మ మెచ్చుకుంటే చాలు. ఎందుకంటే మీ అంతరాత్మయే దైవం.
(స,సా..డి.99పు.375)