సంపార: స్వప్నతుల్యోహి రాగ ద్వేషాది సంకులః
సంభవం సత్యవద్భాతి ప్రమోదీ సత్య సత్య వాన్.
ప్రేమ స్వరూపులారా!
కలలు కంటున్నంతవరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి. అటులనే రాగద్వేషాదులలో కూడిన సంసారము జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే. గోచరిస్తుంది. పరమార్ధదశలో ప్రవేశించి నప్పుడు ప్రపంచమంతయు స్వప్నతుల్యమవుతుంది.
(శ్రీ వ.1990 పు.98)