దుర్మార్గులకు ఒక నమస్కారం, సన్మార్గులకు ఒక నమస్కారం అన్నాడు. కబీరు. అప్పుడు శిష్యులు సన్మార్గులకు నమస్కారం చేయటంలో ఒక సార్థకర ఉన్నది. కాని, దుర్మార్గులకు నమస్కారం చేయటంలో ఏమి సార్థకత ఉన్నది? అని ప్రశ్నించారు. అప్పుడు కబీరుదుర్మార్గులకు మీ వియోగం అవసరమని, సన్మారులకు మీ సంయోగం, అవసరమని నమస్కారం చేయమన్నాడు. అనగాసాధు పురుషుల సంయోగం, దుషుల వియోగం కావాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. సాధుపుంగవులకు సమీపంలో ఉండాలి. ఈ రెండింటి ద్వారా మనకు సుఖం లభిస్తుంది. సమ్యక్ యోగం ఇతిసంయోగం . ఈ సంయోగం చేతనే నిజమైన యోగం మనకు ప్రాప్తిస్తుంది. కనుక ఇట్టియోగాన్ని సాధ్యమైనంత వరకు మీరు సాధించి, ఆదర్శమూర్తులుగా, ఇతరులకు కూడా బోధించి, కీర్తిని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను.
(శ్రీ డి.2001 పు. 26)
(చూ|| బ్రహ్మసాక్షాత్కారజ్ఞానము)