ఉగ్రపు నరసింహుడుద్భవించుటచేత
కృతయుగంబున కబ్బె కీర్తిరేఖ
అలనాడు శ్రీరాముడవతరించుటచేత
త్రేతాయుగమునకు తేట కలిగే
ప్రథిత కృష్ణుడపుడు మధురలో జన్మింప
ద్వాపరంబు మిగుల ధన్యమయ్యె
జగతిలో పుటపర్తి సత్యసాయి జనింప
కలియుగంబునకబ్బె కాంతిరేఖ
పరమపూరుషులివ్విధి ప్రతి యుగమున
అవతరించుచునుందురహా యనంగ
ధన్యతను గాంచె వీరిచే ధరణి యెల్ల
ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు?!
(స.సా.న.2019పు.చివర)