మానవుని అనుకూలముల బట్టి ధర్మములు మారవు! ధర్మమునకు చలనము లేదు. ఆనాడు, నేడు, యేనాడూ, ధర్మము ధర్మముగానే యుండును. "కాలే సంధ్యా సమాచరేత్" అనగా సకాలమునకు సంధ్యా వందనం చేయవలెను.
సంధ్యావందనము అను వ్యుత్పత్తిని బట్టి, సమ్-సమ్యక్ : లెస్సగా భగవంతుని యందు, థ్త్యె - చిన్తన (మనస్సును నిలుపుట), లెస్సగా భగవంతునియందు మనస్సు నిలుపుటయే సంధ్యయనబడును.
(శ్రీ.స.సూ.పు, 110/111)
పూర్వము ఋషులు చెప్పినట్లు!
సంధ్యాహినోఽ , శుచిర్నిత్యమనర్హ న్నిర్వకర్మ
యదస్య త్కురుతే కర్మ వతస్య ఫలభాగ్భవేత్"
అనగా, ద్విజుడు సంధ్యావందనము పరిత్యజించినచో భ్రష్టుడగునని సర్వస్మృతులు తెలుపుచున్నవి. సంధ్యావందనముచేయని వారు ఎట్టి అన్యకర్మలు చేయుటకు అర్హులుకారు. దీనిని పట్టి చూడ ఆనాటి ఋషులు దీర్ఘ కాలము సంధ్యను ఉపాసించే వారగుటచే దీర్ఘావును, యశస్సును, కీర్తిని, ప్రజ్ఞను, బ్రహ్మవర్చసును పొంది యుండిరని మనువు కూడనూ చెప్పెను కదా!
కాని దీనిని పట్టి చూచిన గాయత్రి ధ్యానము లేనివాడుబ్రాహ్మణుడు కాజాలడు. ఇక్కడే బ్రాహ్మణుడన బ్రహ్మతత్త్వము పొందిన, బ్రహ్మోపాసనచే పవిత్రుడైన, ఆత్మార్థపురుషుని అంశమైన, నేటి మానవుపురుషుడు; ఇక్కడ జాతి మత భేదములకు సమకట్టకూడదు. ప్రత్యేకించి, బ్రాహ్మణుడను నామము సాంప్రదాయాను గుణ్యముగా వచ్చినవారు, దీనిని ప్రధానముగా పాటించ వలెను.
(ధ.పు.52/53)