నాకు కాఫీ, టీ వంటివి గిట్టవు. ఎక్కువ నూనెతో చేసినవి నచ్చవు. బిస్కెట్లు, చాక్లెట్లు ముట్టనే ముట్టను. వాటి వాసనకూడా గిట్టదు. రాగిముద్ద, కొద్దిగా వేరుశనగ పచ్చడి తీసుకుంటానంతే. ఇంకేమీ తీసుకోను. స్కూలులో చదువుకునే రోజుల్లో జొన్నరెట్టి మధ్యలో గుంతగా చేసి అందులో వేరుశెనగ చట్నీ వేసుకొని గుడ్డలో చుట్టుకొని తీసుకువేళ్ళేవాడిని. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అందరూ ఒక ప్రక్కన కూర్చుని భోజనం చేస్తుంటే, నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చుని తినే వాడిని, అన్నారు. "స్వామీ! రొట్టి గట్టి పడుతుందంటారు. తినటం కష్టం కదా!" అన్నాను. “ఏముండదు. నీళ్ళలో ముంచేసరికి మెత్తబడుతుంది. అప్పుడు తినవచ్చు..
బ్రహ్మాండమంతయు బొజ్జులో నుండగ, భవ్య భోజ్యంబులు నాకు పెట్ట తగున?
(స.సా..ఫి.2001 పు.61)