హెచ్చు సంపద లొచ్చిన కానీ ఏనుగు గుట్టములెక్కిన కానీ
పిచ్చోడు అని పేరొచ్చిన గాని ప్రియముతో పెద్దలు పొగడినగానీ
దేవుని మరువకురా ఉన్నది దైవము ఒక్కడురా॥
దుష్టజనులు దూషించినగాని దోషరహితుడై వుండినగానీ
కష్టములెన్నో వచ్చినగాని కాయము వ్యాధుల చిక్కినగానీ
దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా!
యోగాభ్యాసము చేసినగానీ భాగవతాదుల చూచినగానీ
పండితుడని బిరుదులిచ్చినగాని పాపిష్టి అన్ననుగానీ
దేవుని వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా||
నిందకులోబడి నిలిచినగానీ నిండు చదువులే చదివినగానీ
నిండుకుండవై యుండుమురా నీవు ఎండిన కుండగా
వుండకురా దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా..!
(య.సా. పు. 96)