విద్యార్థులారా! ఉన్న సత్యాన్ని చెపుతున్నాను. మీరు మరోలా భావించకూడదు. ఈనాడు దేశం అనుభవిస్తున్న కష్టనష్టములకు మూలకారణం ఎవరు? విద్యావంతులే! ఎందుకంటే, వారు తమ విద్యను దేశ శ్రేయస్సుకోసం ఉపయోగించకుండా కేవలం స్వార్థం కోసం ఉపయోగ పెడుతున్నారు. మన భారత దేశంలో ఎంతోమంది విద్యావంతులున్నారు. ఎంతో గొప్ప మేధావులున్నారు. కాని, వారిలో పరోపకార బుద్ధి లేకపోవడంచేత దేశం దురవస్థల పాలవుతున్నది. వారందరూ ఏకమై ప్రజాక్షేమం కోసం పాటుపడితే దేశం ఎంత బాగుపడుతుంది! కాని, వారు తమ మేధాశక్తిని విదేశాలలో ఉపయోగపెడుతున్నారు. మనదేశంలో పది వేల రూపాయల జీతం తీసుకొని కనీసం పది రూపాయల పని కూడా చేయకుండా దేశద్రోహానికి పాల్పడుతున్నారు. కాని, విదేశాలకు పోతే అక్కడ రాత్రింబవళ్ళు పని చేస్తారు. అక్కడ చేసే పని స్వదేశంలో ఎందుకు చేయకూడదు? మొట్టమొదట స్వదేశంపై ప్రేమను ప్రకటించాలి.. -
(స.సా.మే 2000 పు.154)