సహృదయత, సానుభూతి, సహనం - తనలోనూ యితరులలోనూ కూడా దైవత్వాన్ని చూసేందుకు దారులు ఈమూడే. దయార్ద్ర హృదయాన్ని జనం ఈనాడు బలహీనత కిందా, పిరికితనం కిందా, అమాయకత్వంకిందా పరిగణిస్తున్నారు. జాలి గుండె పనికి రాదట! గుండె రాయి చేసి కోవాలట! కఠినమైన ఆదోవన నడిస్తే తటస్థించేవి ఏమిటి? అశాంతి, కల్లోలం, యుద్ధం, పతనం, నాశనం! శాశ్వత సుఖశాంతులు లభించేది ప్రేమ వల్లనే. విచారాన్ని పంచుకొని తగ్గించవచ్చు – సంతోషాన్ని పంచుకొని పెంచవచ్చు. మనిషి పుట్టింది. తోటివారితో కష్టసుఖాలు పంచుకోటానికి ఆర్తులను ఆదుకోడానికి దీనులను సేవించటానికీ, జీవిత పరమార్థం ఇవ్వడమే గాని గుంజుకోవడం కాదు.
(శ్రీసా.గీ.పు.137)