దానము

దీనజనులకు శక్తికొలది దానము చేయాలి. అయితే యెవరు దానమునకు పూనుకొనుటకు అర్హులుసన్యాసులకు ధనముండదు. అందుకే దానము చేయనవసరము లేదు. గృహస్తులే ధనమును దానము చేయుటకు అర్హులు. గృహస్తుడు ధర్మమార్గమున ధనమునార్జించి తనకు. తనబిడ్డలకు వుపయోగించుకొనుచు కొంచము ధర్మము చేస్తూవుండాలి. ధనమును దానము చేయుట పవిత్రమైనది. అందువలన పిల్లలకు భవిష్యత్తులో మంచి కలుగును. దైవము యొక్క యేకత్వమునుమానవత్వము యొక్క సమత్వమును అభివృద్ధి పరచుకొనే నిమిత్తము ప్రయత్నించాలి. రెండూ లభించుటకు హృదయమును నిర్మలముగా ప్రేమమయముగా తీర్చిదిద్దుకోవాలి.

(భ.స. వే ప్ర పు.151)

 

 కొందరు ఆస్తికులు దాన ధర్మాదులు కూడనూ దేహతపస్సుగా భావింతురుమంచిదే. అయితే దేశకాల పాత్ర ననుసరించి కూడనూ దానము చేయవలెను. ఎట్లన యే ప్రదేశమున విద్యావిధానము లేక కష్టపడుచుందురో అచట పాఠశాలలునుఆరోగ్యహీనులై రోగ పీడితులై బాధపడు ప్రదేశములందు ఆరోగ్య సౌకర్యములు కలిగించుటఅతివృష్టి అనావృష్ణులచే అల్లాడు వారలకు ఆకలి దప్పులను తీర్చి ఆదుకొనవలెను. బ్రహ్మవిద్యధర్మప్రబోధనలుపరోపకార ప్రవర్తనలుపాత్రత చూచి నేర్పవలెను. అట్లు విచారణచేసి దేనియందు యే వ్యక్తి శక్తి హీనమై వ్యధనొందుచుండునో అట్టివానికి అవసరమైన దానిని ఇచ్చుట సాత్విక దానమని అందురు. దానము చేయు వారలలో యెక్కువమంది ప్రతిఫలాపేక్షచే చేయుచుందురు. కొంతమంది మాత్రమే భగవత్ కటాక్షమునే ప్రతిఫలా పేక్షగా భావించు చుందురు. భగవదనుగ్రహ ఫలమును కోరి చేయు దానము  సాత్వికమే అగును. అట్లుకాక ప్రత్యుపకారము నాశించియోపేరు ప్రతిష్టను పొందగోరియోలేక పదిమంది దానపరుడని తలంచుటకై మెప్పునకు అందరి ముందు యిచ్చి తదుపరి పరితపించుటయోలేక మనః క్లేశమువలననో ఇచ్చిన దానము రాజసిక మందురు. సత్కార పూర్వకముకాకతిరస్కారభావముతో దానమునకు తగని వ్యక్తికికానీ, స్థానమునకు కానీ అనగా తిండి తీర్థములకు కొదవలేని స్థానమున అన్నదానముతగని స్థానమే అగును. రొగులు వెళ్ళుటకు సాధ్యముకాని ప్రదేశములలో వైద్యాలయములు నిర్మించుటవృధానేయగును. కడుపునిండుగా తిని కదలలేనివానికి అన్నము ఉదరభారమనిపించును. వానికి అవసరములేని దానిని వాడు పొందియూ దుర్వినియోగ పరచును. కాన ఇట్టి సార్థకము కాని దానములు తామసికమని అందురు.

 

దానమున జాగ్రత్తగా మెలగవలసి యుండును. పూరకే అడిగిన వారందరికి తలంచిన స్థానము లన్నింటియందూ దాన ధర్మము చేయరాదు. అట్లు చేయతలచిన పై చెప్పిన రాజసికతామసికసాత్వికములలో దేనికి సంబంధించి యున్నదో యోచించి చేయవలెను సుమాపేరు ప్రతిష్టలకు గానీఆడంబరములకు గానీప్రయోజనము కానిది కానీ అయివుండ కూడదు. అన్ని ప్రవృత్తులయందునూ సాత్వికము చాలా పవిత్రము. అనగా దృష్టియందుకానీశ్రవణమందుకానీవాక్కులందు కానీ సాత్వికమయి వుండవలెనని దీని భావము

(గీ.వా.పు.233/234)

(చూ|| ఏదిగుమ్మడికాయధనమునరజన్మ)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage