నాలుగు విధములైన దైవోపాసకులుగా ఉన్నారు. వారు ద్విజులు, మునులు, అల్ప బుద్ధులు, విదితాత్ములు. , అగ్నిహోత్రములందే దైవబుద్ధి కలిగి పూజించి భుజించువారు ద్విజులు.
మునులు పరమాత్మను హృదయనివాసిగా నెంచి ప్రార్థించువారు. అల్పబుద్దులు. ప్రతివాదులు చిత్రపటములయందే దైవబుద్ధి కలిగి పూజించి భుజించువారు. విదితాత్యులు సర్వ భూతాత్మకమగు ప్రంచమంతయూ పరమాత్మయే యని తెలిసి ధ్యానించువారు. అన్ని విధముల వుపాసనలూ ఆయాస్థానములకు గొప్పవే, కాని ఉత్తమమయినవారు విదితాత్మ ఉపాసకులే. వారే శ్రేష్టులు.
(ప్ర. వా. పు. 23/24)