ఎట్టివారికి సేవ సలిపినను దైవానికే యనుభావముండ వలెను. భగవంతునికి రెండు రూపములున్నవి. అవి లక్ష్మీనారాయణ, దరిద్రనారాయణ స్వరూపములు.లక్ష్మీనారాయణునికిఎట్టి సేవయు చేయనక్కరలేదు. పేరునందే తెలియుచున్నది. లక్ష్మి ప్రక్కనే ఉండుటచేత లక్ష్మీనారాయణునికి మన సేవలు అనవసరము. కాని దరిద్రనారాయణుడు పేరునందే యన్నట్లు దీనుడు, ఒంటరివాడు, కనుక అట్టి దరిద్రనారాయణునికి సేవ చేయుట అవసరము.
సంస్థలయందున్నను లేకున్నను సమస్తము ఈశ్వరత్వమేయను భావము కలిగియుండవలెను. సంస్థలు నిర్దేశించినవి కనుక నేను చేయుచున్నాను అన్న భావముండరాదు. ఎవరు చూచినను, చూడకున్నను నీ అంతరాత్మగమనించుచునేయున్నది.నా సంతృప్తికి, నా ఆనందమునకు, నా ముక్తి కొరకుసేవచేయుచున్నానని భావించవలెను.
(స.సా.ఆ. 85 పు.267)