దయచేత ధన్యులు కావలెరా
ఎంతటి వారైనా దయచేత ధన్యులు కావలెరా
అసురులైన భూసురులైనా అఖండ తెలివి కలవారైనా
దయచేత ధన్యులు కావలెరా
విద్యనేర్చి వాదాడీనగాని - పద్యములెంలో పాడినగాని
కొండ గుహలలో నుండినగాని - కుర్చొని జపములు చేసినగాని
దయచేత ధన్యులు కావలెరా
యోగాభ్యాసము చేసినగాని - భాగవతాదులు చూచినగాని
బాగుగ గడ్డము పెంచినగాని - పట్టెనామములు పెట్టినగాని
దయచేత ధన్యులు కావలెరా.
(స.సాడి. 96 పు. 335)
(చూ|| అమోఘుడు, విద్య, కాంతము)