భగవంతుడు నీలవర్ణుడంటారు. అంటే ఆతని శరీరము నీలవర్ణమని కాదు. అతను జ్ఞాన భాస్కరుడు. జ్ఞాన స్వరూపుడు, జ్ఞానజ్యోతి. అతను అనంతుడు. ఆకాశము వలె అంతులేని వాడు, సముద్రములా ఆద్యంతరహితుడు. రెండూ కూడా నీలవర్ణమే. భగవంతుడు కూడా నీలవర్ణుడే. అతను నీలపు రంగులో పుట్టలేదు. అతడు అనంతుడు, అంతము లేనివాడు.
(ది.ఉ.12.4.1993)
(చూ|| కళ్యాణము)