ఇప్పటి నుంచీ క్రమక్రమంగా నిస్పంగత్వం అలవరుచు కోండి. ఎందుకంటే మీరు అత్యంత ప్రియంగా భావించుకుంటున్న వాటిని వదిలి పెట్టిపోవలసిన తరుణం ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. వ్యామోహాలతో బంధించే వస్తువులను పోగుచేయవద్దు. బంధ విముక్తి ప్రదాత ఆ పరమాత్మునితో అనుబంధం ఏర్పరచుకోవాలి.
(వ.1963 పు.165)