నిర్గుణోపాసకునిలో మొదటి లక్షణము, ఇంద్రియములను తన ఆధీనమునందుంచుకొనవలెను. రెండవది సమస్త పరిస్థితులలోను సమానబుద్ధి కలిగియుండవలెను. ఇక మూడవది. కష్టసుఖముల యందును, కష్ట నిష్ణూరములయందును, అందరికినీ ఉపకారిగానే యుండవలెను. ఇట్టి మూడు లక్షణములు కలవాడు అక్షరోపాసకుడని తలంచుము: ఇవి నిర్గుణోపాసకుని లక్షణములు." అక్షరోపాసకులన్ననూ, నిర్గుణోపాసకు లన్ననూ వక్కటియే అని పాఠకులు భావించవలెను.
(f.పు.195)
(చూ॥ మానవ జీవితము)