నాకొరకు కాదు. మీ కొరకు నేను మీవలె మాట్లాడు చున్నాను. తిరుగుచున్నాను. భుజించుచున్నాను. మీకు అర్థమగు రీతిగా ప్రవర్తించు చున్నాను. మీలో వుండి, మీలో ఒక్కడినై మీ విశ్వాసమును, ప్రేమను, విధేయతను చూరగొని మిమ్ము దైవత్వము వైపు మరలించు చున్నాను. మీ యందు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించుటయే నా ఆశయము. మీ నిజతత్వమును గ్రహించి తద్వారా ఈ విశ్వ సత్యమును గుర్తించెదరు. ఈ చరాచర సృష్టికంతకూ నేనే అంతర్వాహినిని, అన్నింటిని ప్రేరేపించు శక్తి నేను, నేనే జ్ఞానిని, జ్ఞానము, జ్ఞేయము నేనిచ్చవచ్చినట్లు నా శక్తిని ప్రదర్శించి మిమ్ము తికమక పెట్టును. నేను ఏమి చేసినా నా ప్రబోధనలను ఆచరణ రూపములో మీకు చూపుటకే, మార్గదర్శకుడనై మమ్ముత్సాహపరచుటకు నా జీవితమే నా సందేశము.
(స. శి.సు. త్మపు.132)
(చూ॥ నా జీవితం)