"ఈ ప్రపంచములో నా వాళ్ళు కానివారెవరూ లేరు. అందరూ నా వాళ్ళే. కొందరు నా నామమునుగాని, మరే యితర నామమును గాని ఉచ్చరించకపోవచ్చు: అయినప్పటికీ వాళ్ళు నా వాళ్ళే. నేను ఎవరినో పలకరించకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు నా వాళ్ళే. నేను ఎవరినీ పలకరించినట్లు చిరునవ్వు నవ్వడం, వ్రేళ్ళు కదపడం మీరు గమనించి ఉంటారు. అప్పుడప్పుడు నేను గాలిలో ఏదో వ్రాస్తున్నట్లు మీకు కనిపిస్తుంది. నేను ఇలా ఎందుకు చేస్తున్నానో తెలుసు కోవాలని మీలో కొందరికి కుతూహలం కలుగవచ్చు. అటువంటి సమయాల్లో, మీ కంటికి కనబడని ఎవరికో నేను సందేశము పంపుతున్నానన్న మాట. నా చేష్టలు మీకు అర్థం కావు. ఎక్కడో చాలా దూరములోనున్న ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఏవైనా ప్రశ్నలు అడిగితే వాటికి నేను జవాబులు వ్రాస్తాను. ప్రతిక్షణం నేను వేలాది మందికి సహాయము చేస్తుంటాను. కాని వీటన్నింటిని నేను ప్రచారము చేసుకోను. ఎందువల్లనంటే, ఒక తండ్రి తన కొడుకుకు చేసే సహాయాన్ని ప్రచారము చేసుకోడు కదా!"
(దై.పు.260)