మానవునికి ఆనందం లభించాలంటే సంతోషం ప్రాప్తించాలంటే ఇలాంటి విశ్వాసం. లేకపోతే ఏరీతిగా తనాయానందాన్ని పొందగలడు? కనుకనే మొట్టమొదట - "సెల్ఫ్ కాన్ఫిడెన్స్- ఆత్మవిశ్వాసము; రెండవది "సెల్ఫ్ శాటిస్ ఫాక్షన్ : ఇట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండిన ఈ ఆనందమనేది మనకు లభిస్తుంది. ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి ఆనందం ఎంతదూరంగా ఉంటున్నది. అట్టి వారు ఆనందం నటించవచ్చును కానీ నిజమైన ఆనందం అనుభవించలేరు. కనుక ఈ "సెల్స్ శాటిస్ ఫాక్షన్" ఉండినప్పుడే "సెల్ఫ్ శాక్రి పైస్ చేస్తాము. తాను సంతోషముగా లేనప్పుడు ఏవిధమైన త్యాగమునకు పూనుకుంటాడు? కనుక ఈ త్యాగమునకు "శాటిస్ ఫాక్షన్" తృప్తి అనేది అత్యవసరం, ఎప్పుడు ఈ "శాక్రిఫైస్" అనేది చేస్తాడో "సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనకు లభిస్తుంది.
కనుకనే నాలుగు "S’ లలో ఉన్న జీవిత రహస్యాన్ని మనం గుర్తించాలి.
First S-Self Confidence
Second S-Sell Satisfaction
Third S- Self Sacrifice
Fourth S - Self Realization
ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మనం ఏనాడు గుర్తింతుమో అప్పుడే Four- F లకు మన Life ను అంకితం చేస్తాము. First f-follow the Master మాష్టర్" అనగా ఎవరు? మన బాల వికాస్ గురువా లేక పాఠశాలలో నున్నటువంటి గురువా? ఈ గురువులు మార్పు చెందువారు. నీయొక్క హృదయమే, నీ కాన్షష్ నె స్" మాషర్, నీ కాన్షష్ నె స్ ను నీవు ఫాలో చేసినప్పుడే నీ జీవితము భద్రమైన స్థానాన్ని అందుకుంటుంది. కనుకనే Follow the Master నీ కాన్ష స్ నె స్ నీవు ఫాలో చేయుము.
1st F-follow the master
2nd F- face the devil.
నీ దుర్గుణములను, దుర్బుద్ధులను దురాలోచనలను, దుర్భావములను కొంతవరకైనా దూరం చేయాల్సి ఉంటుంది. ఇక మూడవ F-fight to the end. 4th F-finish the game.ఈ నాలుగు F లుకూడ మీరు నిరంతరము హృదయములో పెట్టుకుని ఉండాలి.
(స.పా.మా.80 పు. 60/61)