భగవంతునికి మనం నారికేళమును పగుల గొట్టి సమర్పించుతాము. మనలో అల్లుకుపోయిన వాంఛలే కొబ్బరికాయకు గల పీచు. దీనిని తీసి వేయడము మనం చేసే నిష్కామ ఆరాధనకు చిహ్నం. తెల్లని కొబ్బరి మనలోని సత్వగుణంతో కూడిన స్థానానికి గుర్తు. కొబ్బరికాయకు గల మూడు కన్నులు మన రెండు కళ్ళు మరియు జ్ఞాననేత్రానికి సంకేతం. తీయని నీరు. మనం సమర్పించే ప్రేమామృతం అదే. నివేదన అంటే మన ఆరాధన.
పూజచేసి కొబ్బరి కాయను కొట్టినప్పుడు, ఇవన్నీ గుర్తించుకోవాలి.
(శ్రీస.ది.వా. పు.69)