ప్రత్యేకంగా అనుసరించవలసిన విధానంగాని, ప్రత్యేక యంత్రాంగమో, మంత్రాంగమో కాని నావద్ద లేవు. నా పద్ధతి చాలా సులభమైనది. సరళమైనది. ప్రేమతో మనస్సులను మార్చడం పైన ఆధారపడి ఉంటుంది. ప్రేమే నా సాధనం. ప్రేమే నా ఆయుధం. ప్రేమ స్వరూపునిగా వర్ణించటమే సరైన పద్ధతి.
( శి.సు..సు. నా. పు. 95)