ఈనాడు "మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి", అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థినులు, తమ సంస్థ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ పేరుకు తగినట్లుగా వారు స్వామిసందేశాన్ని ఆచరణ పూర్వకంగా ప్రచారం సల్పుతున్నారు. వారు చేపట్టిన సేవాకార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టు (నివేదిక) మీరింతకు ముందు విన్నారు. అయితే, మీరు విన్నది తక్కువగాని, వారు చేసినది ఎక్కువగా ఉన్నది. "మీరిపోర్టు అడ్వర్ టైజ్ మెంట్ మాదిరి ఉండకూడదు. కాబట్టి, చిన్న రిపోర్టును తయారు చేసి తీసుకురండి" అని వారికి నేనే చెప్పాను. అందువల్ల, వారు ఎంతోచేసినప్పటికీ రిపోర్టును మాత్రం చాలచిన్నదిగా తగ్గించుకొని తీసుకు వచ్చారు. నిజం చెప్పాలంటే, వారు చాల సేవలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, కెనడా, ఆమెరికా, జపాన్ మున్నగు అనేక దేశాలలో కూడా ఇక్కడి నుండి వెళ్ళిన బిడ్డలున్నారు. వారు కూడా అక్కడ అనేక సేవలు సల్పుతున్నారు. సత్యసాయి ఇన్ స్టి ట్ ట్యూట్ పేరు నిలబెడుతున్నారు. సేవాకార్యక్రమాల కోసం వారికి వచ్చే జీతాన్ని ఖర్చు పెడుతున్నారు. ఎందుకు మీరిలా చేస్తున్నారని తల్లి దండ్రులు అడిగితే "అమ్మా! నాన్నా! మమ్ముల్ని చదివించింది స్వామియే కదా! స్వామి మాకు ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని అందించాడు. మా హెల్త్, వెల్త్ (ఆరోగ్యం, ఐశ్వర్యం) రెండూ స్వామి అనుగ్రహించినవే. కనుక, మేము సంపాదించినది కూడా సేవకే ఖర్చు పెట్టాలి. ఒక్క నయా పైసా మేము దుర్వినియోగం చేయటం లేదు" అని సరియైన జవాబు చెపుతున్నారు. తల్లిదండ్రులలో కూడా మంచి మార్పు తెప్పిస్తున్నారు. ఇక్కడ మన జనరల్ హాస్పిటల్ లో వన్స అనే కంటి డాక్టరున్నది. ఆమె తన బిడ్డను మన కాలేజిలో చదివించింది. ఆ అమ్మాయి ఇప్పుడు తన భర్తతో ఆస్ట్రేలియాలో ఉన్నది. అతనిలో మంచి మార్పు తెప్పించింది. అతడు కూడా సేవలో చురుగ్గా పాల్గొంటున్నాడు. భార్యాభర్త లిరువురు తమ సంపాదనను ఖర్చు పెట్టి అనేక సేవలు సల్పుతున్నారు. వారికి బిడ్డలు లేరు. వన్స నావద్దకు వచ్చి "స్వామీ! నా బిడ్డకు బిడ్డను ప్రసాదించండి" అని ప్రార్థించింది. అప్పుడా అమ్మాయి చెప్పింది - "స్వామీ! నాకు ఆ బాధ్యతలు, బంధనలు వద్దు. స్వామియే నా సర్వస్వము. అందరూ నా అక్కచెల్లెండ్రే. వారి బిడ్డలందరూ నా బిడ్డలే. కాబట్టి, నాకు బిడ్డలు అక్కర్లేదు. నాకు స్వేచ్ఛగా సేవ చేసుకునే అవకాశాన్ని ప్రసాదించండి " ఇట్టి భక్తిప్రపత్తులు కల్గినవారు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంతేకాదు. మన పురాణాలలో కూడా సీత, సావిత్రి, చంద్రమతి, దమయంతి మున్నగు ఆదర్శమూర్తులైన స్త్రీలు అనేకమంది ఉన్నారు. ఇలాంటి స్త్రీల వల్లనే భారత దేశమే కాదు, ప్రపంచమంతాసుక్షేమంగా ఉన్నది. కనుక. స్త్రీలను చులకనగా చూడకూడదు. వారు బలహీనులని భావించకూడదు.
స్త్రీలలో ఉన్న శక్తిసామర్థ్యములు చాల గొప్పవి. ఇంకా కొన్ని విషయములు మీకు తెల్పాలి. వచ్చే నవంబరులోఈ దేహము యొక్క 75 వ పుట్టిన రోజు వస్తున్నది. ఆ సందర్భంగా వచ్చిన భక్తులకు పది దినముల ఉచితభోజనం అందించాలని "సత్యసాయి మెస్సెంజర్స్" చాల పెద్ద ప్లాను వేశారు. ఇప్పటి నుండియే దానికి తగిన ప్రయత్నాలు ప్రారంభించారు. వెయ్య సంచుల బియ్యం కొని సిద్ధంగా ఉంచారు. స్త్రీలకు 75000 చీరలు పంచి పెట్టాలని సంకల్పించుకున్నారు. ఆ చీరలన్ని ఒకే డిజైములో ఉండాలని వాటిని తయారు చేయడానికి అప్పుడే ఆర్డరు కూడా ఇచ్చారు. ఈ సంస్థలో 3000 మంది పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దినదినమునకు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే ఉన్నాయి. అసలు స్త్రీల యందే భక్తి ప్రపత్తులు అధికంగా ఉంటాయి. కనుకనే, స్త్రీలను భక్తితోను, పురుషులను జ్ఞానంతోను పోల్చారు. భక్తి అనే ప్రీకి భగవంతుని అంతఃపురంలో కూడా ప్రవేశించడానికి అధికారం ఉంటుంది. జ్ఞానమనే పురుషునికి కేవలం భగవంతుని దర్బారు హాలులో మాత్రమే ప్రవేశం ఉంటుంది. అంత:పురమనగా ఏమిటి? అంతరాత్మయే అంతఃపురము. అందులో ప్రవేశించేది భక్తి తప్ప జ్ఞానము కాదు. పుట్టపర్తికి వచ్చే పురుషులలో చాలమందిస్త్రీల యొక్క ప్రోద్బలంవల్లనే రాగల్గుతున్నారు. పురుషులను భక్తి మార్గంలో ప్రవేశపుట్టేవారు స్త్రీలే. ఆనాటి గోపికల భక్తి ప్రపత్తులను విచారణ చేస్తే హృదయం కరిగిపోతుంది. గోపికలు తమకు ఒకే మనస్సు ఉన్నదని, అది కృష్ణునితో వెళ్ళిపోయినదని ఉద్దవునితో అన్నారు. అదే గొప్ప వేదాంతం. ఆనాడు ఉద్దపుల్లో గొప్ప జ్ఞానిగాభావించే వారు. అలాంటి ఉద్ధవుడు కూడా కృష్ణుని వద్దకు వెళ్ళి "కృష్ణా! ఆ గోపికల భక్తి ప్రపత్తులలో కొంత భాగమైనా నాకు ప్రసాదించు" అని ప్రార్థించాడు.
నా ఉద్దేశ్య మేమంటే "మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి" సంస్థ సభ్యులు ఆధ్యాత్మిక తత్వాన్ని ఇంకా అధికంగా దేశమంతాప్రచారం చేయాలి. వీరివల్లనే దేశమంతా బాగుపడుతుంది. ఒక్క భారతదేశమే కాదు, యావత్ప్రపంచమే బాగుపడాలి.ప్రాచీన భారతీయ సంస్కృతి పునరుద్ధరింపబడాలి. “ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" దైవత్వం తప్ప మరేదీ లేదు. మీకు కనిపించే మనుష్యులు మనుష్యులు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు, చెట్లు చెట్లు కాదు. అన్నీ దైవస్వరూపములే. "యద్భావం తద్భవతి", మీరు ప్రాకృత దృష్టితో చూస్తున్నారు. కాబట్టి మీకు మనుష్యుల మాదిరి కనిపిస్తున్నారు. దైవదృష్టితో చూడండి, అందరూ దైవంగానే గోచరిస్తారు.
(స.సా.జ..2000పు.12 /13)
మున్ముందు "మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి" చేయవలసిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నదానం చేయడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, పిల్లలకు చదువు చెప్పడం - ఇవి చాల అవసరమే. కాని వీటితో పాటు ప్రజల దృష్టిని ఆధ్యాత్మికం వైపు మరల్చాలి. ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే వశిస్తుంది. కేవలం మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి మాత్రమే కాకుండా మగపిల్లలు కూడా ఆధ్యాత్మిక తత్త్వాన్ని ప్రచారం చేయడానికి పూనుకోవాలి. నిజంగా మగ పిల్లలకు ఉన్నంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు. ఆడపిల్లలకే స్వేచ్చ ఉండి యుంటే ఈ పాటికి అర్థ ప్రపంచాన్ని మార్పు చేసి యుందురు. కానీ, వారు ఏ పని చేయాలన్నా తల్లిదండ్రులు ఒకవైపున, భర్త ఒకవైపున, పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు. అయినప్పటికి వారు అన్నింటిని తట్టుకొని, నెట్టుకొని ముందంజ వేస్తున్నారు. మగవారికి ఎవ్వరూ అడ్డు చెప్పేవారు లేరు. అలాంటప్పుడు వారు ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపకుడదు?! ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఎందుకు ప్రచారం చేయూడదు?! సమాజ సేవలో ఎందుకు పాల్గొనకూడదు?! సమాజ సేవ చేయకపోతే మీరు చదివిన చదువులవల్ల ప్రయోజనం మేమిటి?!ధన సంపాదన కాదు, గుణసంపాదన చాల అవసరం. ఎంత మంది సంపాదించలేదు! కాని, వారు తమ వెంట ఏమితీసుకుపోయారు? ఏమీ లేదు. అయితే, సంపాదన కూడా ఉండవలసిందే. కాని దానికొక పరిమితి ఉండాలి. మీ శక్తిని, కాయమును సమాజ సేవకు అంకితం చేయాలి. ప్రపంచంలోని అశాంతిని, అలజడిని దూరం చేయడానికి యువకులు కంకణం కట్టుకోవాలి. అయితే, ఈనాడు కొంతమంది. ఇంట్లో తల్లిదండ్రులను కూడా సరిగా చూసుకోవడం లేదు. తల్లిదండ్రులనే చూసుకోలేని వారు దేశాన్ని ఏరీతిగా ఉద్ధరించగలరు? మొట్టమొదట తల్లిదండ్రులను సేవించండి: మీ కుటుంబాన్ని పోషించుకోండి: మీ గ్రామసేవ చేయండి. తరువాతనే దేశసేవ ప్రారంభించవచ్చు. ముఖ్యంగా మీరు దేశాభివృద్ధికి సమాజ సంక్షేమానికి పాటుపడండి. దేశ సేవగా మారిపోతుంది. మీరు చేసే సేవకు ఫలితాన్ని ఆశించకండి. ఆది దైవమే ఇస్తాడు.
మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి విద్యార్థినులారా! మీరు చేసే సేవలు చాల సంతోషాన్ని కల్గిస్తున్నాయి. కాని, ఇంకా అధికంగా మీరు సేవలు చేయాలని నేను ఆశిస్తున్నాను. మీ తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి, వారి ఆశీర్వాదములను కూడా పొందండి. మీ తల్లిదండ్రులకు మీరు సేవ చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు మీకు సేవ చేస్తారు. మీరు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి ఫలితాన్నే పొందుతారు. ఇదే వేదాంతం బోధించే ప్రధానమైన సత్యం. దైవ ప్రేమకు పాత్రులు కండి. ఈ ప్రపంచంలో మీరు సంపాదించవలసిన అత్యంత ఉత్తమమైన, అత్యంత మైన సంపద దైవ ప్రేమ ఒక్కటే. దైవప్రేమకు మీరు పాత్రులైతే దేనినైనా సాధించగలరు. అట్టి దైవ ప్రేమను సంపాదించుకొనే నిమిత్తమై సమాజ సేవలో పాల్గొనండి. పెద్ద డిగ్రీలు పొంది గొప్పగా సంపాదించాలనే ఆశలను తగ్గించుకోండి.. సంపాదించుకోండి. సంతోషమే. కాని, సంపాదించినది సమాజ సేవకు వినియోగించండి. చిత్తమునందు భగవచ్చింతన చేయండి. అప్పుడే మీ జీవితం సా ర్థకమవుతుంది.
(స.సా.జ.2000పు.14)
సత్యంలో జీవించండి. ధర్మంతో జీవించండి. ప్రేమతో అందరూ ఏకం కండి. ప్రతి మానవుని యందున్న ప్రేమ ఒక్కటే. మీయందున్న ప్రేమయే పరులయందూ కూడా ఉన్నది. అందరియందున్న ప్రేమ ఏకమైనప్పుడు విశ్వకుటుంబం ఏర్పడుతుంది. ప్రేమను ముక్కలు చేసి, ద్వేషాన్ని పెంచేవారికి ఏమీ సుఖముండదు. నేను అహర్నిశలు ప్రేమతోనే కాలం గడుపుతున్నాను, ఎంతోమంది విద్యార్థులకు విద్యను ఉచితంగా నేర్పిస్తున్నాను. ఉచిత విద్య మాత్రమే కాదు, ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తున్నాను. కానీ, కొంతమంది తమ దుర్భావములను ఈ పిల్లల పైన రుద్ది వారిని కూడా పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, మా పిల్లలు బంగారం వంటివారు. మా పిల్లలపాదధూళి తీసుకున్నా వారికి ఆ దుర్భుద్ధులు పుట్టవు. మా విద్యాసంస్థల్లో చదువుకున్న పిల్లలు ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆడపిల్లలు "మెస్పెంజర్స్ ఆఫ్ సత్య సా యి" అనే పేరు పెట్టుకొని ఎన్నో దేశాల్లో ఎన్నో సేవలు చేస్తున్నారు. తాము చేయడమేగాక తమ భర్తలతో కూడా చేయిస్తున్నారు. స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, రష్యా చైనా మున్నగు అనేక దేశాల్లో మా పిల్లలు పని చేస్తున్నారు.ఆపిల్లలకు కొంతమంది విదెశీయులు డబ్బు ఆశ చూపించి, సత్యసాయిబాబాకు విరుద్ధంగా కొన్ని స్టోరీలనువ్రాయమంటున్నారు. మత ప్రచారం సల్పేవారు. ఇట్టి దుష్ప్రచారానికి పూనుకొని, స్విట్జర్లాండులో ఒక అమ్మాయిని ఈ విధంగా అడిగినప్పుడు ఆ అమ్మాయి కోపం తో తాను కాలికి తోడుక్కున్న బూటును తీసింది. ఇదేనా మీ మతం నేర్చే సత్యము? ఇదేనా మీ మతం బోధించే ఆదర్శము? చీ, పోమ్మ"ని గట్టిగా అరిచింది. కాని, కొంతమంది జూడాస్ లు డబ్బుకోసం ఆశపడి ఈ దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు. ఆనాడు జూడాస్ గతి ఏమైంది? "ఛీ, నా గురువుకు నేనింత ద్రోహం చేసితినా! నేను దైవద్రోహిని" అని ఏడుస్తూ తల కొట్టుకున్నాడు.అన్ని ద్రోహములకంటే దైవద్రోహం చాలా పెద్దది. ఎన్ని జన్మలెత్తినా ఆ పాపం తీరదు. కనుక, దైవద్రోహానికి ఎవ్వరూ పూనుకోకూడదు.
(స.సా.జ.2001వు.4/5)
ప్రేమస్వరూపులారా! దేనికీ మీరు వెఱువనక్కర్లేదు. తల పైన పిడుగు పడినా ఫరవాలేదు. మీరేమీ భయపడకండి.ప్రాణం పోతే ఒక్క తూరి పోతుందిగాని, రెండు తూర్లు పోదు కదా! ఈనాడు కాకపోయినా రేపైనా పోతుంది. కాబట్టి, ప్రాణం పోతుందని మీరు భయపడనక్కర్లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. సత్యాన్ని అనుసరించడానికి మీరు భయపడకూడదు. సత్యాన్ని వదలుకొని, ప్రేమను వదలుకొని ఏదో ప్రాణం రక్షించుకోవాలని జపములు, తపములుచేస్తే లాభం లేదు. ఎవరేమనుకుంటారో అని భయపడకండి. ఎవరేమనుకున్నా మీకు వచ్చిన నష్టమేమిటి? మీ ఇష్టం మీది. వారి ఇష్టం వారిది. మీరేమీ తప్పుచేయటం లేదు కదా! భగవంతుణ్ణి ప్రేమించడంలో తప్పే ముంది? ఆ ప్రేమచేతనే ప్రాణం వదలాలి. అంతే గాని, పిచ్చిపిచ్చి కలహాలకు, లోనిపోని సందేహాలకు అవకాశమందించకండి. ఎవరి కర్మను వారు అనుభవిస్తారు.
"ఎవరు చేసిన కర్మ వారనుభవించక
ఎవరికైనను తప్పదన్నా!
ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు?
అనుభవించుట సిద్ధమన్నా!
అయితే మీరు నిరంతరము భగవచ్చింతన చేస్తూ ఉంటే మీకు ఎలాంటి బాధలూ సంభవించవు. అడవులందున్న, ఆకసముననున్న, పట్టణమున నున్న పల్లెనున్న| గుట్టమీదమును నట్టేట పడియున్న ఎక్కడున్నప్పటికీ భగవంతుడు మీ వెంటనే, ఇంటనే ఉండి మిమ్మల్ని కాపాడుతుంటాడు. ఎక్కడున్నా దైవత్వం మీవెంటనే ఉంది. జీసస్ అనండి, రామా అనండి కృష్ణా అనండి; ఏ పేరుతోనైనా పిలవండి. కాని, భగవంతుడు ఒక్కడే. ఆప్రేమయే దైవం. కనుక, దైవత్వాన్ని విమర్శించడానికి ఎవ్వరికి అధికారం లేదు; హక్కులేదు. విమర్శలన్నీబూటకపు మాటలే. అవి దైవత్వాన్ని చలింపవేయలేవు. ఈ కలి ప్రభావంచేత ప్రజలు ధనం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. ధనం కోసం ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఎందుకిలాంటి తుచ్చమైన ధనము? ప్రేమధనమును సంపాదించుకోండి. ప్రేమయే అన్ని బాధలను నివారణ గావించగలదు.
ప్రేమస్వరూపులారా! ఎక్కువ సేపు మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో! అయితే, ఇది బాధకానే కాదు. ఇది గొప్పబోధ. అధైర్యంతో కృంగిపోయేవారికి ధైర్యమనే టానిక్ను అందించాలి. "మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి" సంస్థకు చెందిన పిల్లలు చాలా గొప్ప సేవలు చేస్తున్నారు. ఒక్కొక్క పర్యాయం తిండి కూడా మాని సేవలలో పాల్గొంటున్నారు. కాని. ఆవిధంగా ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదు. "బెంగుళూరులో స్వామి ఇంత పెద్ద హాస్పిటలు కట్టిస్తున్నారు. కాని అక్కడ సేవ చేయడానికి మాకు శక్తి చాలదే! పురుషుల మాదిరి రాళ్ళు, ఇటుకలు మోసి సహాయం చేయడానికి మాకు చేతకాదే!" అని వారు బాధపడుతున్నారు. వారికి వచ్చే జీతాలలో చాలా మిగిలించుకొని నాకు చెప్పకుండా సత్యసాయి ట్రస్టు పేరుతో మొన్నటి దినము 75 లక్షలు పంపించారు. ఇంక, మన కాలేజీలో చదువుకున్న మగపిల్లలు బయట అనేక చోట్ల పనిచేస్తున్నారు. బయట ఉండినా వారు నావారే! వారు ఎంతో శ్రమ పడి, తిండి కూడా సరిగా తినకుండా ఇక్కడ నెలలకొద్దీ కాచుకొని ఉంటారు పాపం! ఆవిధంగా మిగిలించుకొని సత్యపాయి ఓల్డ్ స్టూడెంట్స్ 45 లక్షలు సెంట్రల్ ట్రస్టుకు పంపించారు.
విద్యార్థినీ విద్యార్థులారా! మేము మీ డబ్బును కోరటం లేదు; మీ ప్రేమను మీ క్షేమాన్ని, మీ అభివృద్ధిని, మీ ఆనందాన్ని మాత్రమే కోరుతున్నాము. మీరు ఎక్కడున్నప్పటికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపండి. ఏదో గొప్ప గొప్ప వారందరూ ఈ ఆసుపత్రికి కోట్ల రూపాయలిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. గొప్ప గొప్ప వారిని మేము అడగటమూ లేదు, వారు మాకు ఇవ్వటమూలేదు. ప్రేమతో ఇచ్చేది చిన్నదైనా గొప్పదే. జీసస్ కు గొప్ప గొప్పవారు గొప్ప గొప్ప బహుమతులను అందించడానికి ప్రయత్నించారు. కానీ, అతను వాటిని స్వీకరించలేదు. ఒక నిరుపేద వృద్ధురాలు ప్రేమలో ఇచ్చిన చిన్న కాసును ఆనందంగా స్వీకరించాడు. తాను మరణించేంత వరకు ఆ కాసుమ తనదగ్గరే పెట్టుకున్నాడు. అదేవిధంగా, నాకు కావలసింది ప్రేమయేగాని ధనంకాదు. మున్ముందు ఇలాంటి హాస్పిటల్ ఇంకా ఎన్నో నెలకొల్పబడతాయి. కాని, నేను ఎవ్వరిని అడగటం లేదు. నాది సత్యసంకల్పం. కనుక, అది తప్పక నెరవేరుతుంది. మనం చేసేది మంచి పని. మంచి పనులకు మంచియే జరుగుతుంది. నా మంచితనమే నాకు సహాయం. విద్యార్థిని విద్యార్థులారా! మీరిచ్చిన డబ్బులు వాపస్ తీసుకోండి. మీ ప్రేమను, మీ క్షేమమును మీ అభివృద్ధిని మాత్రమే మేము కోరుతున్నాము మీరు మీ ప్రవర్తనలో ఆదర్శాన్ని చూపినప్పుడే నాకు ఆనందము. సత్యసాయి స్టూడెంట్స్ చాలా మంచి ప్రవర్తన కలిగినవారనే పేరు తెచ్చుకోండి నేనీనాడు కాదు. ఏనాడూ ధనమును ఆశించను. ధనం వస్తుంది, పోతుంది. నైతిక శక్తి వస్తుంది. అభివృద్ధి చెందుతుంది. కనుక, నైతికశక్తిని పెంచుకోండి. శీలమును అభివృద్ధిపరచుకోండి. ధైర్యాన్ని పెంచుకోండి.ప్రేమను అందరికీ పంచండి.
స్వామిపట్ల భక్తులకు పిల్లలకుగల ప్రేమ ఎలాంటిదో బయటి వారికి తెలియదు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక మీరు స్వామి సేవ చేస్తున్నారు. కాని, అలాంటి సేవ నాకక్కర్లేదు. జీవుడే దేవుడు. జీవుల్లో హింసించకూడదు. కాబట్టి మీరు బాగా భుజించి, ఆరోగ్యంగా ఉండి తరువాత సేవలో ప్రవేశించండి. మీరు పల్లెపల్లెకు పోయిసేవ చేస్తున్నారు. ఇట్టి సేవాధనము ఎన్నో కోట్ల రూపాయలతో సమానం. కాబట్టి, మీరు సేవాధనమును పెంచుకోండి. పల్లెపల్లెకూ వెళ్ళి సేవలు చేయండి: బీదవారిని ఆదరించండి; ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెట్టండి..
(స.సా.జ..2001పు.7/8)