భూమాత, గోమాత, వేదమాత, మనల్ని కన్నమాత - ఈ నలుగురు మాతలను ఆరాధించండి. అట్టి మాతలను రక్షించుకోవడానికి సరియైన సాధనలు సలపండి. అన్నిటికన్నా మిన్న దైవారాధన. ఈనాడు దైవారాధన సన్నగిల్లిపోవటం చేతనే, ప్రపంచంలో అనేక దుఃఖములు సంభవిస్తున్నాయి. అరాచకత్వం ప్రబలుతున్నది. దైవారాధన ఒక్కటే దేశాన్ని రక్షించగలదు. శాంతిని చేకూర్చగలదు.
(శ్రీ.ఏ.2002 పు. 24)
(చూ॥ వరలక్ష్మీవ్రతము)